భారతీయ వంటకాల్లో మసాలా దినుసులు లేనిదే ఆ వంట పూర్తవదు. అందుకే పేద, ధనిక భేదం లేకుండా.. మసాలా దినుసులు మాత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. అయితే మసాలాలను కేవలం వంటలకు మాత్రమే కాకుండా.. ఇతర ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వాడతారు.
పూర్వకాలంలో మందులు సరిగ్గా లేనప్పుడు..వీటిని ఉపయోగించి ఎన్నో అనారోగ్యాలకు చికిత్స చేసేవారు. ఔషధాలుగా మాడే మసాలాల్లో లవంగాలు మొదటివిగా చెబుతారు. లవంగాలను ఎన్నో రకాల ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి ఈ లవంగాల్లో ఎన్నో ఆరోగ్య కరమైన పోషకాలు ఉండటంతో..వీటితో ఎన్నో వ్యాధులను నయం చేసుకోవచ్చు.
లవంగాల్లో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. లవంగాలు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దీని వల్ల ఎన్నో రకాల సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తి మనకు లభిస్తుంది. అంతేకాదు లవంగాలతో నోటి ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరచుకోవచ్చు. ముఖ్యంగా లవంగాలు బుగ్గన పెట్టుకుని నమలడం వల్ల ..దంతాలు, చిగుళ్ల సమస్యలు, నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు.
లవంగాల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. వీటివల్ల శరీరంలోని ఫ్రీ రాడికల్స్ సమస్యను లవంగాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా లవంగాలు రోజూ తింటే క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటీస్ వంటి వాటిని కూడా కంట్రోల్ చేయవచ్చు.
అంతేకాదు ఒబెసిటీతో బాధపడేవారికి లవంగాలు నిజంగా ఓ వరం అనే చెప్పొచ్చు. ఎందుకంటే లవంగాలతో బరువు కూడా తగ్గొచ్చు. వెయిట్ లాస్ అవడానికి చాలా రకాలుగా లవంగాలను వాడొచ్చు.రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో రెండు లవంగాలను వేసి ఈ నీటిని పరగడపున తాగితే ఊబకాయం తగ్గుతుంది. అంతేకాదు లవంగాలను పొడిలా చేసుకుని ఆ పొడిని గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకున్నా ఫలితం ఉంటుంది. లవంగాలతో టీ తయారు చేసుకుని తాగినా కూడా వెయిట్ లాస్ అవుతారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY