ఈ మధ్య కాలంలో చాలామంది అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బరువ తగ్గడానికి నానా తంటాలు పడుతున్నారు. అయితే ఫుడ్ కంట్రోల్ ఒకటే సరిపోదని..ఫిజికల్ ఎక్సర్‌సైజులు కూడా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శారీరక వ్యాయామం కూడా ఉంటేనే ఎవరైనా ఆరోగ్యకరంగా బరువు తగ్గగలరని అంటున్నారు.
అధిక బరువు వల్ల బీపీ, షుగర్, కీళ్లనొప్పులు, క్యాన్సర్, గుండె వ్యాధులు వంటి పెద్ద పెద్ద జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. అందుకే చాలామంది బరువు పెరగకుండా ఉండటానికి ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. కానీ ఆహారం తక్కువగా తీసుకుంటే ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చి ఇంకా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తే ఆరోగ్యకరంగా బరువు తగ్గడం సాధ్యమవుతుంది.
ప్రోటీన్లు ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవడం, కొవ్వులు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, సమతులాహారం తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు. నీటిపాళ్లు ఎక్కువగా ఉండే తాజా కాయగూరలు తీసుకోవాలి. గుడ్డులో ఉండే అమైనో యాసిడ్లు బరువు తగ్గడంలో సహాయపడతాయి.భోజనానికి అరగంట ముందుగా అరలీటర్ నీళ్లు తాగితే మెటబాలిజం రేటు పెరుగుతుంది.
అలాగే వ్యాయామాల వల్ల కండరాలకు తగిన పని కలిగి.. రక్తనాళాల్లో రక్తప్రసరణ పెరుగుతుంది. దీంతో లయబద్ధమైన శ్వాస ప్రక్రియతో పాటు గుండెవేగం పెరుగుతుంది. దీనివల్ల మాత్రమే శరీరంలో కొవ్వు కరిగి బరువు తగ్గే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా ఫ్యాట్ ను తగ్గంచడంలో ఆరోగ్యకరంగా బరువు తగ్గడం తగ్గించడంలో ఏరోబిక్స్ బాగా ఉపయోగపడుతుంది. వ్యాయామాల ద్వారా బరువు తగ్గాలని అనుకునేవాళ్లు సైక్లింగ్, స్విమ్మింగ్, వాకింగ్, జాగింగ్ చేస్తే.. సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.