వేయించిన శనగలతో పాటు బెల్లం కలిపి తింటే చాలా లాభాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో ఖాళీ కడుపుతో బెల్లం, పుట్నాలు కలిపి తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో బెల్లం, పుట్నాలపప్పు కలిపి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. వీటిలోలో యాంటీ-ఆక్సిడెంట్లు, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతటమే కాకుండా..అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.
బెల్లంలో ఉండే విటమిన్ బి6 మెదడు పనితీరును మెరుగుపరిచి.. జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. శరీరంలోని జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. కాలేయాన్ని శుభ్రపరచడమే కాకుండా.. శరీరం నుంచి విష వ్యర్థాలను బయటకు తొలగిస్తుంది. బెల్లం, వేయించిన శనగ పప్పును డైలీ తీసుకోవడం వల్ల కండరాలు వృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. శారీరక బలహీనతను దూరం చేస్తూ.. శరీరాన్ని దృఢంగా మార్చుతుంది.దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.
బెల్లం, వేయించిన శనగలను సూపర్ పూడ్ అని కూడా అంటారు. శనగపప్పులో ప్రొటీన్లు ఎక్కువగా ఉండగా.. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు బెల్లంలో జింక్,సెలీనియం మెండుగా ఉన్నాయి. వేయించిన శనగలులో బీ6, సీ, ఫోలేట్, నియాసిన్, థయామిన్, రైబోఫ్లావిన్, మాంగనీస్, ఫాస్పరస్, ఐరన్, రాగి వంటి ఇతర ఖనిజాలు ఉన్నాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం, వేయించిన శనగలు తినటం వల్ల జీర్ణవ్యవస్థను సక్రియం చేస్తుంది. దీనివల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు రావు. ఇది కడుపుని శుభ్రపరిచి.. శరీరం నుంచి విష పదార్ధాలను తొలగించడంలో సహాయపడుతుంది. బెల్లం, వేయించిన శనగలు కలిపి తినటం వల్ల ప్రోటీన్, పొటాషియం, పిండి పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి. వీటివల్ల కండరాలు, ఎముకలు బలోపేతం అవుతాయి. కండరాల అభివృద్ధికి సహాయపడతాయి.
ఐరన్ పుష్కలంగా ఉండే బెల్లం, శనగలు రక్తహీనతను నివారించి హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ముఖ్యంగా ఇది మహిళలకు చాలా మంచిది. బెల్లం, శనగలలో కాల్షియం,మెగ్నీషియం, భాస్వరం ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఎముకల నొప్పిని తగ్గించి, ఎముకలను బలపరుస్తాయి. అయితే వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల ఈజీగా బరువు పెరిగే అవకాశం ఉంది కాబట్టి..ఓవర్ వెయిట్ ఉన్నవాళ్లు అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలి.