రక్త హీనతకు ఈజీగా చెక్ పెట్టొచ్చు..

You Can Easily Check For Anemia

చిన్న పనులకే త్వరగా అలసిపోవడం, మానసికంగా అలసిపోవడం, చిరాకుగా ఉండడం, బలహీనంగా ఉండటం, కళ్లు తిరుగుతున్నట్లు అనిపించటం , తరుచుగా తలనొప్పి వస్తుండటం, నిద్ర పట్టకపోవటం వంటి లక్షణాలు ఉంటే రక్త హీనత ఉందేమోనని చెక్ చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. సాధారణంంగా మన శరీరంలోని పెద్ద ఎముకల్లో హీమోగ్లోబిన్‌ తయారవుతుంది. శరీరంలో ఐరన్ తక్కువ ఉండటం వల్ల ఈ హీమోగ్లోబిన్‌ అనే ప్రొటీన్‌ తక్కువగా తయారవుతుంది. దీనివల్లే రక్తహీనత ఏర్పడుతుంది.

కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే ఎనీమియాకు చెక్ పెట్టొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అన్ని రకాల తాజా ఆకుకూరల్లో ఐరన్‌ అధిక మోతాదులో ఉంటుంది. ముఖ్యంగా తోటకూర, గోంగూర, పాలకూర, మెంతి కూర లాంటివి రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత నుంచి మనల్ని రక్షించుకోవచ్చు. అలాగే చిక్కుళ్లు వంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.ముఖ్యంగా రక్తం తక్కువగా ఉంటే ..తినే ఆహార పదార్థాల్లో కచ్చితంగా పాలకూరను చేర్చాలి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది

మాంసాహారులైతే మేక మాంసం, కోడి మాంసం, చేపలు తినాలి. ఆర్గాన్‌ మీట్స్, లివర్‌లో ఐరన్‌ అధికంగా ఉంటుంది. ఇందులో విటమిన్‌ బి 12, జింక్, ఫాస్పరస్‌ అధికంగా ఉంటుంది. వీటిని మైక్రోవేవ్‌లో బేక్‌ చేసి తీసుకోవచ్చు. ఇది శరీరంలో ఐరన్‌ లెవల్స్‌ని పెంచుతుంది. మాంసాహారం అలవాటు ఉన్నవారు బోన్‌ సూప్‌ తాగటం లాంటివి చేస్తుండాలి. దీని వల్ల ఎనీమియా తగ్గించే అవకాశం ఉంటుంది.

శరీరంలో రక్తం పెరుగుదలకు బీట్ రూట్ బాగా ఉపయోగపడుతుంది.అలాగే రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పనే ఉండదని చాలా మంది చెబుతుంటారు. మనల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచడంతో పాటు రక్తంలో హిమోగ్లోబిన్ పెంచుతుంది .
చూడానికి రక్తంగా ఎర్రగా కనిపించే దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. దానిమ్మను రోజూ తింటే శరీరంలో రక్తం వృద్ధి చెందుతుంది.

డ్రై ఫ్రూట్స్ డైలీ లైఫ్ లో యాడ్ చేసుకుంటే రక్తహీనతకు చెక్ పెట్టొచ్చు. ఖర్జూరాలు, బాదం, వాల్‌ట్స్ వంటి ఎండు ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని తీసుకోవడం వలన రక్తంలో ఎర్రరక్త కణాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అలాగే నువ్వులు, పల్లీలు బెల్లంతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.