ఇండియా సూపర్ ఫుడ్..అమెరికాలో నిషేధం

Ghee Indias Super Food Banned In America, Super Food Banned In America, Ghee Indias Super Food Banned, Indias Super Food Ghee Banned, America Banned Ghee, Eat Ghee, Ghee, Ghee Banned In America, Indias Super Food Ghee, Latest America Ghee News, America Ghee News, Latest America Food News, Word Health News, India, Mango News, Mango News
ghee,eat ghee,India's super food ghee, ghee banned in America

మనం తినే చాలా ఆహార పదార్ధాలపై రకరకాల అపోహలుంటాయి. కొందరు నీళ్లు బాగా తాగాలంటే.. మరికొందరు మనిషి శరీర తత్వాన్ని బట్టే తాగాలని అంటారు. అన్నం వద్దు చపాతీలు తినమని కొందరంటే.. వద్దు చపాతీలు ఇంకా డేంజర్ అని మరికొందరంటారు. అలాగే కొందరు డాక్టర్లు మంచివి అని చెప్పిన అహారాలే మరికొంతమంది డాక్టర్లు వాటిని తినొద్దని హెచ్చరిస్తారు. దీంతో ఏం తినాలో.. ఏం తినకూడదో అసలు ఏం తింటే ఏం జరుగుతుందోనని జనాలు అయోమయానికి గురవుతున్నారు. తాజాగా ఈ లిస్టులోకి నెయ్యి పేరు చేరింది. భారతీయులు ఎంతో ఇష్టంగా తినే నెయ్యి అగ్రరాజ్యం అమెరికా బ్యాన్ చేసింది.

నిజానికి చాలానెయ్యి అంటే చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో పప్పు, ఆవకాయ కాంబినేషన్‌తో కలిపి నెయ్యి వేసుకొని తింటే స్వర్గం కళ్లముందు నిలిచినట్లు ఉంటుందని భోజన ప్రియులు చెబుతూ ఉంటారు. అంతేకాదు పూర్వ కాలం నుంచి చిన్న పిల్లలకు కూడా నెయ్యి ఆహారంలో తినిపించడం భారతీయులకు అలవాటు. నెయ్యి ఆరోగ్యకరమైనదనదని ఆయుర్వేదం కూడా చెప్పడంతో..భారతీయ వంటకాల్లో ఎక్కువగా  నెయ్యిని ఉపయోగించే తయారుచేస్తారు. అయితే భారత్‌లో సూపర్ ఫుడ్‌గా పేరు బడ్డ నెయ్యిని.. అమెరికాలో తినొద్దని బ్యాన్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

జీర్ణక్రియను క్రమబద్దం చేయడానికి , కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి.. నెయ్యిని తినాలని భారతదేశంలో చెబుతూ ఉంటారు.దీనిలో విటమిన్ ఎ, విటమిన్ ఈ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయని అంటారు. అంతెందుకు సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ ఇప్పుడు పొద్దునే  ఘీ కాఫీ తాగడం అలవాటు చేసుకున్నారు. దీనివల్ల మధుమేహానికి చెక్ పెట్టొచ్చని, బ్యాడ్ కొలస్ట్రాల్‌ను అడ్డుకోవచ్చని చెప్పడంతో సోషల్ మీడియాలో ఇది తెగ ట్రెండ్ అవుతుంది.

ఇలాంటి సమయంలోనే అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సూచనతో  అమెరికాలో నెయ్యి తినడాన్ని నిషేధించారు.నెయ్యి తింటే అధిక రక్తపోటు, గుండెపోటు, ఊబకాయంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆందోళన వ్యక్తం చేసిందట. దీంతో అమెరికా ప్రభుత్వం ఘీ తినడాన్ని బ్యాన్ చేసింది.  నిజానికి నెయ్యిపై ఉన్న అవగాహనలో.. భారతీయులతో పోలిస్తే అమెరికాది పూర్తి వైరుధ్యమైన విధానమని దీంతో తేలిపోయింది. కానీ మెటబాలిజమ్ మంచిగా ఉండి, హెల్తీ వెయిట్ ఉన్నవాళ్లకు నెయ్యి తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 20 =