తెలుగు ట్రావెల్ వ్లాగర్ మనోజ్ఞ సూర్యదేవర అజర్‌బైజాన్ పర్యటనలో భాగంగా గబాలాలోని ఒక అద్భుతమైన రిసార్ట్‌లో విభిన్నమైన ‘గ్లాంపింగ్ డోమ్ స్టే’ అనుభవాన్ని పంచుకున్నారు. సాధారణ హోటల్ రూమ్‌లకు భిన్నంగా ఉండే ఈ డోమ్ స్టే, ప్రైవేటుగా ఉంటూనే అన్ని ఆధునిక సౌకర్యాలను అందిస్తోంది.
ఈ డోమ్‌లో కింద బెడ్‌తో పాటు, మెట్ల ద్వారా చేరుకునే మరో బెడ్ ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణ . చుట్టూ పచ్చని చెట్లతో, చల్లని వాతావరణంలో ఎంతో ప్రశాంతంగా, అందంగా ఉన్న ఈ ప్రాంతం తనకు బాగా నచ్చిందని మనోజ్ఞ తెలిపారు.అజర్‌బైజాన్ ట్రావెల్ విశేషాలు, డోమ్ స్టే పూర్తి రూమ్ టూర్ వివరాల కోసం ఈ వీడియో చూడవచ్చు.




































