ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ సంస్థ ఇప్పుడు తమ కస్టమర్లకు మరి కొన్ని సేవలను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇప్పటి వరకూ ఉబర్ బైక్, ఆటో, కారులలో తమ కస్టమర్లకు సర్వీసులను అందిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు అతి త్వరలోనే ఉబర్ బస్సు సేవలను కూడా ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.
దేశ రాజధాని అయిన ఢిల్లీలో ముందుగా తమ సేవలను ప్రారంభించడానికి సంస్థ సిద్ధమైంది. ఢిల్లీ ప్రీమియం బస్ స్కీమ్ కింద ఉబర్ ఈ బస్ సర్వీసులను నడపనుంది. దీనికి సంబంధించి ఉబర్ సంస్థ ఇప్పటికే ఢిల్లీ రవాణా మంత్రిత్వ శాఖ నుంచి లైసెన్స్ ను కూడా అందుకుంది . అయితే ఇలాంటి లైసెన్స్ జారీ చేసిన తొలి రవాణా శాఖగా..హస్తిన నిలిచింది. మరోవైపు ఇటువంటి లైసెన్స్‌ను అందుకున్న తొలి అగ్రిగేటర్ గా ఉబర్ సంస్థ నిలిచింది.
ఢిల్లీలో బస్సులకు ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు తాము గుర్తించామని, దీంతో అధికారికంగా తమ సేవలను ఢిల్లీలో ప్రారంభించబోతున్నామంటూ ఉబర్ షటిల్ ఇండియా సంస్థ తెలిపింది. తమ బస్సు సర్వీసుల కోసం కస్టమర్లు వారం రోజుల ముందు నుంచి కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పింది.
తమ యాప్‌లోనే ఉబర్ బస్సులకు సంబంధించి వివరాలు ఉంటాయని..ఆ బస్సు ఎక్కడ ఉంది..? బస్సు చేరుకునే సమయంతో పాటు బస్సు ప్రస్తుతం ఎక్కడ ఉందనే వివరాలు ఉంటాయి. అంతేకాదు బస్సు రూట్లకు సంబంధించిన వివరాలు ఇలా బస్సులకు సంబంధించిన అన్ని వివరాలు ఎప్పటికప్పుడు ఉబర్ యాప్ ద్వారా తెలుసుకోవొచ్చు. ఒక ఉబర్ బస్సులో 19 మంది నుంచి 50 మంది వరకు ప్రయాణించొచ్చు. ఉబర్ టెక్నాలజీ సాయంతో.. స్థానిక ఆపరేటర్లు ఈ ఉబర్ బస్సులను నడుపుతారని ఉబర్ సంస్థ తెలిపింది.
ఢిల్లీలోని అన్ని ప్రాంతాలను ఈ బస్సు సర్వీసులు కవర్ చేస్తాయని అలాగే వ్యాపార ప్రాంతాల్లో కూడా తమ బస్సులు నడుస్తాయని ఉబర్ సంస్థ తెలిపింది. ఢిల్లీలో అతి త్వరలో ఉబర్ బస్సు సేవలను అధికారికంగా అందుబాటులోకి తీసుకొస్తున్నందుకు ఆనందంగా ఉందని సంస్థ పేర్కొంది. దీంతో పాటు ఢిల్లీ-ఎన్ సీఆర్ తోపాటు కోల్‌కతాలో కూడా ఉబర్ తమ బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు చెప్పింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY