నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లల పెంపకం తల్లిదండ్రులకు ఒక సవాలుగా మారింది. Mango Life వేదికగా Psychologist Samba Siva పిల్లల మనస్తత్వంపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పిల్లల్లో కనిపించే కోపం, భయం సహజమేనని, అయితే అవి అతిగా మారి వస్తువులు విసిరేయడం వంటి పనులు చేస్తున్నప్పుడు నిపుణుల సలహా తీసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా స్క్రీన్ టైమ్ తగ్గించే విషయంలో పిల్లలతో ముందే ఒప్పందం చేసుకోవడం, Siblings మధ్య ఎప్పుడూ పోలికలు పెట్టకపోవడం వంటివి వారి మానసిక వికాసానికి తోడ్పడతాయన్నారు. జంక్ ఫుడ్ మానేసి శారీరక శ్రమను ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు.పిల్లల పెంపకంపై మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం పూర్తి ఇంటర్వ్యూను వీక్షించండి.








































