సీరియల్ యాక్టర్ సంతోష్ తన S Flicks Entertainments అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా ఆయన బిగ్ బాస్ 8 లోని ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ తో ఇంటర్వూ చేశారు. సెలబ్రిటీ విజన్ సెగ్మెంట్లో భాగంగా యాక్టర్ సంతోష్ మొదటి ఎపిసోడ్ లో స్పెషల్ గా తన ఇండస్ట్రీ ఫ్రెండ్ అయినా శేఖర్ బాషాను తీసుకువచ్చారు. బిగ్ బాస్ గురించి అందులో జర్నీ గురించి చాలా విషయాలను శేఖర్ బాషా యాక్టర్ సంతోష్ తో పంచుకున్నారు. బిగ్ బాస్ లో తన స్పాంటేనియస్ జోక్స్ తో అందరిని ఎంటర్టైన్ చేసిన శేఖర్ బాషా టూ వీక్స్ లో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడానికి గల కారణాలను కూడా వెల్లడించారు. మీరు కూడా వారిద్దరు ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే కింది వీడియోను చూడండి.
Home స్పెషల్స్