విదేశాల్లో కారు స్టీరింగ్ ఎడమవైపు ఎందుకు?

Why Is The Car Steering Wheel On The Left In Many Countries, Car Steering Wheel On The Left, Car Steering Wheel, Car Steering Wheel Left In Many Countries, America, Australia, Canadan, Car, Car Steering, Foreign Countries, Uk, Left Side Car Steering, Reason Behind Left Side Car Steering, Mango News, Mango News Telugu

ఇండియాలో అయితే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎడమ వైపు వెళ్తాం. కానీ అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ అరేబియా, యూఏఈ లాంటి దేశాల్లో అయితే కుడి వైపు నుంచి వెళ్లాలి. అక్కడి కార్ల స్టీరింగ్‌లు కూడా ఎడమ వైపు ఉంటాయి. అక్కడ మన అలవాటు ప్రకారం ఎడమ వైపు నుంచి వెళ్తే ప్రమాదం తప్పదు. అసలు ఈ కుడి, ఎడమల మ్యాటర్ ఏంటి. దేశాల మధ్య కుడి, ఎడమ ప్రయాణాలకు ఉన్న చారిత్రక కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియాలో పూర్వ కాలం నుంచి ఎడమ వైపే..

పూర్వం సైనికులు గుర్రాలపై వెళ్లేటప్పుడు కత్తిని కుడి వైపు పట్టుకునేవాళ్లు. గుర్రం ఎక్కేందుకు కూడా కుడి కాలిని ఉపయోగించేవాళ్లు. ఇందుకు అనువుగా ప్రయాణం ఎడమ వైపు నుంచి సాగించేవాళ్లు. కొంత కాలానికి సామాన్యులు కూడా గుర్రాలను వాడటం మొదలు పెట్టారు. వీళ్లు కూడా సైనికుల ప్రయాణాన్ని ఫాలో అవడంతో.. ఇండియాలో ఎడమ వైపు ప్రయాణం చేసే విధానం మొదలైంది. కాల క్రమేనా అదే అధికారిక విధానంగా మారింది. ఇందుకే ఇండియాలో కార్ల స్టీరింగులు కుడి వైపుకు ఉంటాయి.

విదేశాల్లో కుడి వైపు ఎందుకు

విదేశాల్లో కుడి వైపు ప్రయాణానికి ముఖ్య కారణం అక్కడి రవాణా వ్యవస్థ. ముఖ్యంగా ఫ్రాన్స్‌లో రవాణా కోసం గుర్రపు బండ్లను ఎక్కువగా ఉపయోగించేవాళ్లు. బండి నడిపే వ్యక్తి కూర్చునేందుకు ప్లేస్ లేక.. ఎడమ వైపు గుర్రం మీద కూర్చుని బండి నడిపేవాడు. కుడి వైపు నుంచి వచ్చే వాహనాలను గమనించడం ఇబ్బందికరంగా మారడంతో.. మొత్తం ప్రయాణాన్ని కుడి వైపుకు మార్చారు. కొంత కాలానికి సామాన్య ప్రజలు కూడా ఇదే పద్ధతి పాటించాలని చట్టం చేశారు. దీంతో ఆయా దేశాల్లో కార్ల స్టీరింగులకు ఎడమ వైపుకు మార్చారు.

బ్రిటన్ ఫ్రాన్స్‌తో ఏకీభవించలేదు

18 వ శతాబ్ధం నాటికి ఫ్రాన్స్, బ్రిటన్ శక్తివంతమైన దేశాలుగా ఉండేవి. ముఖ్యంగా ఫ్రాన్స్ తన ఆధీనంలో ఉన్న దేశాల్లో ప్రయాణాన్ని కుడి వైపుకు మార్చాలని నిర్ణయించింది. కానీ బ్రిటన్ దీనికి అంగీకరించలేదు. తన ఆధీనంలో ఉన్న భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాల్లో ఎడమ వైపు ప్రయాణించే విధానాన్ని తీసుకువచ్చింది. జనరల్ హైవే పేరుతో కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ఇండియాలో ఎడమ వైపు ప్రయాణం విధానం రావడానికి ఇది కూడా ముఖ్య కారణం.

చాలా దేశాల్లో ముందు నుంచీ ఎడమ వైపు ప్రయాణం

ప్రపంచంలోని చాలా దేశాల్లో ముందు నుంచి ఎడమ వైపు ప్రయాణించే విధానమే ఉండేది. కాని కాలక్రమేణా చాలా దేశాలు తమ పద్ధతులను మార్చుకుంటూ వచ్చాయి. కొందరు అగ్ర దేశాల ఆంక్షలతో మారితే.. కొందరు తమ వెసులుబాటు కోసం మార్పులు చేసుకున్నారు. జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్, అంటి ఆసియా దేశాలు.. అమెరికా, కెడనా వంటి దేశాల్లో ఎడమ వైపు ప్రయాణించే విధానం ఉండేది. ఇప్పుడు ఆ దేశాలు కూడా కుడి వైపు ప్రయాణాన్ని అనుసరిస్తున్నాయి. ప్రస్తుత గుణాంకాల ప్రకారం ప్రపంచంలో 75 దేశాల్లో ఎడమ వైపు ప్రయాణాన్ని, 165 దేశాల్లో కుడి వైపు ప్రయాణాన్ని అనుసరిస్తున్నాయి.