2024-25 రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారా అదరగొడుతున్నాడు. తిరిగి టీమిండియాలోకి రావడమే లక్ష్యంగా చెలరేగిపోతున్నాడు. ఈ క్రమంలో సెంచరీ చేసి ప్రత్యేక రికార్డు సృష్టించాడు. రాజ్‌కోట్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో చండీగఢ్‌పై సెంచరీ చేయడం ద్వారా ఈ సౌరాష్ట్ర స్టార్ వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో 66వ సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు. 66వ ఫస్ట్ క్లాస్ సెంచరీతో అత్యధిక ఫస్ట్ క్లాస్ సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా (65)ను అధిగమించాడు. అదే సమయంలో, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 21 వేల పరుగుల మార్కును కూడా దాటాడు.
టెస్టు క్రికెట్‌లో దశాబ్ద కాలంగా నంబర్ 3లో బ్యాటింగ్ చేసిన ఛెతేశ్వర్ పుజారా గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లో చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే గత రెండేళ్లుగా అస్థిరమైన ప్రదర్శన కారణంగా భారత టెస్టు క్రికెట్ జట్టులో చోటు కోల్పోయాడు. అంతేకాకుండా, యువ ఆటగాళ్ల మధ్య పోటీ కారణంగా అతని పునరాగమనం కూడా కష్టమయిపోయింది. అయితే పట్టుదలతో పస్ట్ క్లాస్ లో నిరూపించుకోని మళ్లీ జట్టులోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు.
కాగా రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో ఛత్తీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో పుజారా అద్భుతమైన డబుల్ సెంచరీతో ఆతిథ్య జట్టుకు ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించాడు. పుజారా 374 బంతుల్లో 23 ఫోర్లు, 1 సిక్సర్‌తో 224* పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. కెప్టెన్ అమన్‌దీప్ ఖరే (203), సంజీత్ దేశాయ్ (146) సెంచరీలతో ఛత్తీస్‌గఢ్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 578/7 భారీ స్కోరు నమోదు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
2005లో సౌరాష్ట్ర తరపున రంజీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన చెతేశ్వర్ పుజారా, అతని తండ్రి అరవింద్ పుజారా మరియు మామ బిపిన్ పుజారా ద్వారా క్రికెటర్‌గా ఎదిగాడు. ఇద్దరూ సౌరాష్ట్ర తరపున రంజీ ట్రోఫీ క్రికెట్ కూడా ఆడారు. అతని మార్గదర్శకత్వంలో ఛెతేశ్వర్ టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఎన్నో రికార్డులు సృష్టించారు.
2010లో బెంగళూరు టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేసిన ఛెతేశ్వర్ పుజారా ఇప్పటివరకు 100కు పైగా మ్యాచ్‌లు ఆడాడు. 43.60 సగటుతో 19 సెంచరీలు, 35 అర్ధసెంచరీలు చేశాడు.