ఐపీఎల్ 2025లో లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చక్కటి ప్రదర్శన ఇచ్చినప్పటికీ జట్టు ఓటమి చవిచూసింది. మ్యాచ్ మొత్తం హార్దిక్ చుట్టూ తిరిగింది. బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ తన పూర్తి స్థాయిలో కృషి చేసినా, జట్టు విజయం దక్కించుకోలేకపోయింది. చివరి వరకు క్రీజులో ఉండి పోరాడిన పాండ్యా, తక్కువ తేడాతో జట్టు ఓడిపోవడం చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్ ముగిశాక గడ్డిమైదానంలో ఉన్న బ్లాక్ బోర్డును తలతో బాదడం చూసిన అభిమానులు కూడా ఎమోషనల్ అయ్యారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హార్దిక్ లక్నోను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ముంబై బౌలర్లు మాత్రం ఆరుగతంగా ప్రదర్శన ఇవ్వలేకపోయారు. లక్నో బ్యాటర్లు పట్టు విడవకుండా ఆడుతూ భారీ స్కోరు సాధించారు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్నో 203 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో కేవలం హార్దిక్ మాత్రమే అద్భుతంగా రాణించాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 36 పరుగులు ఇచ్చి 5 కీలక వికెట్లు తీసుకున్నాడు.
బ్యాటింగ్‌లో ముంబై ఇండియన్స్ మంచి ఆరంభం ఇచ్చినప్పటికీ, మధ్యలో వికెట్లు పడిపోవడంతో ఒత్తిడికి లోనయ్యారు. చివర్లో హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచినా, ఇతర బ్యాటర్లు తడబడడంతో 12 పరుగుల తేడాతో ఓటమి చెందారు.
మ్యాచ్ అనంతరం హార్దిక్ మాట్లాడుతూ, “ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. గెలుపు అయినా, ఓటమి అయినా అది జట్టు మొత్తం మీద ఆధారపడి ఉంటుంది. నేను ఎవర్నీ నిందించను,” అని చెప్పాడు. హార్దిక్ పోరాటం అభిమానుల గుండెల్లో ముద్ర వేసినా, జట్టు ఓటమి మాత్రం నిరాశకు గురి చేసింది.
Hardik Pandya said, "I don't want to pin point anyone. We win as a team, we lose as a team. I take full ownership of this defeat." pic.twitter.com/0MNNoWEK4j
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 4, 2025