ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్‌షిప్ దక్కించుకున్న టాటా గ్రూప్

BCCI Announces TATA Group bags Title Sponsorship Rights for Women’s Premier League for Five Year Period, BCCI Announces TATA Group bags, Sponsorship Rights for Women’s Premier League, Women’s Premier League Sponsorship Rights,WPL TATA Group bags, Mango News, Mango News Telugu, Wpl Tata Group Bags Price,Bcci Chairman,Bcci Highlights,Bcci Members,Bcci News,Bcci President,Bcci President List,Bcci President Salary,Bcci Secretary,Bcci Tickets,Bcci Twitter,Jay Shah Bcci,Women'S Premier League,Women'S Premier League Fixtures,Women'S Premier League Results,Women'S Premier League Salaries,Women'S Premier League Table,Women'S Premier League Winners List,Womens Premier League Cricket,Womens Premier League India Team,Womens Premier League Ipl,Womens Premier League Schedule,Womens Premier League Table,Womens Premier League Teams Cricket,Wpl Tata Group Bags Company,Wpl Tata Group Bags In Hyderabad,Wpl Tata Group Bags List,Wpl Tata Group Bags Price List

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభ ఎడిషన్ 2023, మార్చి 4వ తేదీ నుండి 26వ తేదీ వరకు ముంబయిలో జరగనున్న విషయం తెలిసిందే. డబ్ల్యూపీఎల్-2023 వేలం ఫిబ్రవరి 13న ముగియడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవలే డబ్ల్యూపీఎల్-2023 షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్‌షిప్ ను టాటా గ్రూప్ దక్కించుకున్నట్టు బీసీసీఐ తాజాగా ప్రకటించింది. టాటా గ్రూప్ కు 2023-2027 వరకు అనగా ఐదేళ్ల పాటుగా డబ్ల్యూపీఎల్ సీజన్‌ల టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను అందజేసినట్టు బీసీసీఐ తెలిపింది. టాటా గ్రూప్ తన రెండు ఫ్లాగ్‌షిప్ బ్రాండ్స్ అయిన టాటా క్యాపిటల్ మరియు టాటా మోటార్స్ ను ప్రమోట్ చేస్తుందని చెప్పారు. అయితే డీల్ విలువ ఎంతనేది వెల్లడించలేదు.

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ, భారత అండర్19 ప్రపంచ కప్ విజేత జట్టు కెప్టెన్ షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ వంటి భారతీయ ప్రతిభావంతులు మరియు విదేశీ స్టార్ ప్లేయర్స్ అలిస్సా హీలీ, డియాండ్రా డాటిన్, ఎల్లీస్ పెర్రీ, సోఫీ ఎక్లెస్టోన్, సోఫీ డివైన్ తదితరులతో డబ్ల్యూపీఎల్ యొక్క ప్రారంభ ఎడిషన్ భారతదేశంలో మహిళల క్రికెట్‌లో కొత్త శకానికి నాంది పలకనుందని బీసీసీఐ పేర్కొంది. మొదటి సీజన్‌ మొత్తం 23 రోజుల వ్యవధిలో జరగనుండగా, 20 లీగ్ మ్యాచ్‌లు మరియు 2 ప్లేఆఫ్ గేమ్‌లను నిర్వహించనున్నారు. మొత్తం 22 మ్యాచ్‌లు కూడా ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం (11 మ్యాచులు) మరియు డీవై పాటిల్ స్టేడియం (11 మ్యాచులు) లోనే జరగనున్నాయి. డబ్ల్యూపీఎల్-2023 మార్చి 4, శనివారం డివై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్ మరియు ముంబయి ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ తో ప్రారంభం కానుంది. మార్చి 24న డీవై పాటిల్ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఇక డబ్ల్యూపీఎల్-2023 ఫైనల్ మార్చి 26న బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం డబ్ల్యూపీఎల్ మ్యాచులు మధ్యాహ్నం 3:30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు జరగనున్నాయి.

బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ, “మహిళల క్రికెట్ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది మరియు మహిళల ప్రీమియర్ లీగ్‌కు టాటా గ్రూప్‌ను టైటిల్ స్పాన్సర్‌గా కలిగి ఉండటం భారతదేశంలో మహిళల క్రికెట్ యొక్క పెరుగుతున్న స్థాయికి నిదర్శనం.డబ్ల్యూపీఎల్ ఇప్పుడు టాటా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌గా పిలువబడుతుంది. బీసీసీఐ మహిళల క్రికెట్‌కు విలువనిస్తుంది మరియు అభినందిస్తుందని, ఆటను మరింత పెంపొందించడానికి డబ్ల్యూపీఎల్ మరొక చొరవ” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =