బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా చెన్నై టెస్టు మ్యాచ్‌లో 280 పరుగుల తేడాతో విజయం సాధించింది శుభారంభం చేసింది. ఇప్పుడు సిరీస్‌లోని రెండో టెస్టు మ్యాచ్ కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ క్రికెట్ స్టేడియంలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనుంది.
కేవలం మూడున్నర రోజుల్లోనే రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా చెన్నై టెస్టు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. దీంతో రెండవ టెస్ట్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని BCCI సెలెక్షన్ కమిటీ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. తొలి టెస్టుకు ఆడిన జట్టునే రెండో టెస్టుకు కొనసాగించాలని నిర్ణయించారు. తొలి టెస్టులో సాధికార విజయం సాధించడంతో సెలక్టర్లు ఎలాంటి మార్పులు చేయలేదు.
దీంతో పేలవ ఫామ్ లో ఉన్న స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు మరో అవకాశం దక్కినట్లయింది. అయితే, కాన్పూర్ టెస్టు కోసం ప్లేయింగ్ ఎలెవన్‌లో కేఎల్ రాహుల్‌కు అవకాశం లభిస్తుందా? లేదా వేచి చూడాల్సిందే. చెన్నై టెస్టులో కేఎల్ రాహుల్ రెండు ఇన్నిగ్స్ ల్లో 16 మరియు 22* పరుగులు చేశాడు. రిషబ్ పంత్ 5వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నందున, కేఎల్ రాహుల్‌కు బదులుగా యువ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్‌కు 6 వ స్థానంలో ఆడించాలని టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించినా ఆశ్చర్యపోనవసరం లేదు.
తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విఫలమైనప్పటికీ.. 280 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ లో ఆర్ అశ్విన్ (113), రవీంద్ర జడేజా (86) మెరుపులు మెరిపించగా, 2వ ఇన్నింగ్స్ బ్యాటింగ్ లో శుభ్ మన్ గిల్ (119*), రిషబ్ పంత్ (109) భారీ సెంచరీలు చేశారు. బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీయగా, ఆర్ అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీశాడు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. తొలి టెస్టులో విఫలమైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి బ్యాట్స్‌మెన్లు రెండో టెస్టులో ఫామ్ అందిపుచుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు.
కాన్పూర్ టెస్టులో భారత్ ఈ 11 మంది ఆడే అవకాశం
- రోహిత్ శర్మ (కెప్టెన్/ఓపెనర్), 02. యసవి జైస్వాల్ (ఓపెనర్), 03. శుభ్‌మన్ గిల్ (బ్యాటర్), 04. విరాట్ కోహ్లీ (బ్యాటర్), 05. రిషబ్ పంత్ (వికెట్ కీపర్/బ్యాట్స్‌మన్), 06.రాహుల్ / సర్ఫరాజ్ ఖాన్ (బ్యాట్స్‌మన్), 07 అశ్విన్ (ఆల్ రౌండర్), 08. రవీంద్ర జడేజా (ఆల్ రౌండర్), 09. జస్‌ప్రీత్ బుమ్రా (రైట్ ఆర్మ్ పేసర్), 10. మహ్మద్ సి రాజ్ (రైట్ ఆర్మ్ పేసర్), 11. ఆకాష్ దీప్ (ఫాస్ట్ బౌలర్).