పొరపాటు అరెస్టు! సైఫ్ అలీఖాన్ దాడి కేసులో ఆకాష్ కనోజియా జీవితం తలకిందులైంది!
సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్టైన ఆకాష్ కనోజియా జీవితమే పూర్తిగా మారిపోయింది. సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన దుండగుడి ముఖం ఆకాష్ ముఖానికి పోలి ఉండడంతో పోలీసులు అతనిని నేరుగా నిందితుడిగా భావించి అరెస్ట్ చేశారు. కానీ అసలు దాడి చేసిన నిందితుడిని మూడు రోజుల తర్వాత గుర్తించిన తర్వాతనే ఆకాష్ నిర్దోషి అని తేలింది.
పోలీసుల పొరపాటు – ఉద్యోగం, పెళ్లి కోల్పోయిన ఆకాష్!
తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలు & అన్యాయ అరెస్టు కారణంగా ఆకాష్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఉద్యోగం పోయింది, పెళ్లి ఆగిపోయింది. కుటుంబం, స్నేహితుల వద్ద అపవాదు ఏర్పడింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఫోటోలు, వీడియోలు జీవితాన్ని నాశనం చేశాయి.
అరెస్టు గురించి ఆకాష్ కన్నీటి కథ
ఆకాష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ స్టేషన్‌లో రైలులో ఉండగా పోలీసులు అకస్మాత్తుగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చూపించిన ఫోటోలోని వ్యక్తి తనని కాదని చెప్పినా, అంగీకరించమని ఒత్తిడి చేశారు. సైఫ్ అలీఖాన్ వద్దకు నన్ను తీసుకెళ్లండి. నన్నే దాడి చేశాడని అతను చెబితే, అరెస్టు చేయండి అని ఆకాష్ కోరాడట. 24 గంటల పాటు విచారణ చేసిన తర్వాత, నిజ నిందితుడిని గుర్తించాక వదిలేశారు.
నా ఫోటో, వీడియోలను తొలగించాలి – న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు!. నాకు అన్యాయం జరిగింది, నాకు మానసిక క్షోభ తట్టుకోలేకపోతున్నా! ఇలా ఎవరికీ జరగకూడదు. నా కుటుంబానికి ఎదురైన అవమానం మర్చిపోలేను! సామాజిక మాధ్యమాల్లో నా ఫోటోలు తొలగించకపోతే కోర్టుకు వెళ్తా! అని చెబుతున్నాడు.