ఐపీఎల్-2020 వేలంలో 8 జట్లు కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీళ్ళే

2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, Indian Premier League 2020 Auction, IPL 2020 Auction, IPL 2020 Auction Full List Of Players, IPL 2020 auction LIVE, IPL-2020 Auction Live Updates, latest sports news, latest sports news 2019, Mango News Telugu, sports news

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 2020 సీజన్‌ వేలం డిసెంబర్ 19, గురువారం నాడు కోల్‌కతాలో జరిగింది. 332 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. ఇక ఎనిమిది ఫ్రాంచైజీలు కలిపి గరిష్టంగా 73 మంది క్రికెటర్లను తీసుకునే అవకాశం ఉన్నా, 62 మంది ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేశాయి. 62 మందిలో 32 మంది జాతీయ ఆటగాళ్లు(క్యాప్‌డ్‌ ప్లేయర్లు), 30 మంది యువ క్రికెటర్లు (అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్లు) ఉన్నారు. ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ పాట్ కమ్మిన్స్ అత్యంత ఖరీదైన ఆటగాడుగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అతన్ని రూ.15.5 కోట్లకు కొనుగోలు చేసింది. మొత్తం 29 మంది విదేశీ ఆటగాళ్ళు ఈ వేలంలో కొనుగోలు చేయబడ్డారు. ఆటగాళ్ల కోసం 8 ఫ్రాంఛైజీలు కలిపి మొత్తం రూ.1,40,10,00,000 ఖర్చు చేశాయి. రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఈ వేలంలో అందరికంటే ఎక్కువుగా 11 మందిని కొనుగోలు చేసింది.

ఐపీఎల్-2020 వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ళు:

చెన్నె సూపర్‌ కింగ్స్‌:

 • సామ్ కుర్రాన్
 • పియూష్ చావ్లా
 • జోష్ హాజిల్‌వుడ్
 • ఆర్ సాయి కిషోర్

ఢిల్లీ క్యాపిటల్స్‌:

 • జాసన్ రాయ్
 • క్రిస్ వోక్స్
 • అలెక్స్ కారీ
 • షిమ్రాన్ హెట్ మైర్
 • మోహిత్ శర్మ
 • తుషార్ దేశ్‌పాండే
 • మార్కస్ స్టోయినిస్
 • లలిత్ యాదవ్

కోల్‌కతా నైట్ రైడర్స్:

 • ఇయాన్ మోర్గాన్
 • పాట్ కమ్మిన్స్
 • రాహుల్ త్రిపాఠి
 • వరుణ్ చక్రవర్తి
 • ఓం సిద్ధార్థ్
 • క్రిస్ గ్రీన్
 • టామ్ బాంటన్
 • ప్రవీణ్ తంబే
 • నిఖిల్ నాయక్

కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌:

 • గ్లెన్ మాక్స్ వెల్
 • షెల్డన్ కాట్రెల్
 • దీపక్ హుడా
 • ఇషాన్ పోరెల్
 • రవి బిష్ణోయ్
 • జేమ్స్ నీషామ్
 • క్రిస్ జోర్డాన్
 • తజిందర్ ధిల్లాన్
 • ప్రభుసిమ్రన్ సింగ్

ముంబయి ఇండియన్స్‌:

 • క్రిస్ లిన్
 • నాథన్ కౌల్టర్-నైల్
 • సౌరభ్ తివారీ
 • మోసిన్ ఖాన్
 • దిగ్విజయ్‌ దేశ్‌ముఖ్‌
 • ప్రిన్స్ బల్వంత్ రాయ్ సింగ్

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు :

 • ఆరోన్ ఫించ్
 • క్రిస్ మోరిస్
 • జాషువా ఫిలిప్
 • కేన్ రిచర్డ్ సన్
 • పవన్ దేశ్‌పాండే
 • డేల్ స్టెయిన్
 • షాబాజ్ అహ్మద్
 • ఇసురు ఉదనా

రాజస్థాన్ రాయల్స్‌:

 • రాబిన్ ఉత్తప్ప
 • జయదేవ్ ఉనద్కత్
 • యశస్వి జైస్వాల్
 • అనుజ్ రావత్
 • కార్తీక్ త్యాగి
 • ఆకాష్ సింగ్
 • డేవిడ్ మిల్లర్
 • ఓషనే థామస్
 • అనిరుథ్ జోషి
 • ఆండ్రూ టై
 • టామ్ కుర్రాన్

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌:

 • విరాట్ సింగ్
 • ప్రియామ్ గార్గ్
 • మిచెల్ మార్ష్
 • ఫాబియన్ అలెన్
 • అబ్దుల్ సమద్
 • సంజయ్ యాదవ్
 • సందీప్ బవనక

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =