రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీతో కలిసి ఆడటం తనపై చాలా ప్రభావం చూపిందని ఆర్‌సీబీ పేసర్ వైశాఖ్ విజయ్‌కుమార్ అన్నారు. 2023లో ఆర్‌సీబీ తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన వైశాఖ్ విజయ్‌కుమార్, ఆ తర్వాత 2024 టోర్నీలోనూ విరాట్ కోహ్లీతో కలిసి ఆడాడు. విరాట్ కోహ్లీతో కలిసి ఆడటం ఒక ఆటగాడిగా తనపై అత్యంత ప్రభావం చూపిందని వైశాఖ్ పేర్కొన్నాడు. గత సీజన్‌లో విరాట్ కోహ్లి ప్రదర్శనను అత్యంత దగ్గర నుంచి పరిశీలించానని.. కోహ్లీ కమిట్మెంట్, నిబద్దత గల ఆటగాడని పేర్కొన్నాడు. ప్రతి రోజు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తాడనిని తెలిపాడు. ఇక డైట్ విషయంలో విరాట్ పక్కాగా ఉంటాడని తెలిపాడు. అతను మ్యాచ్‌కు ముందు ఎంత ఆత్మవిశ్వాసంతో ఉంటాడో మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ అంతే స్థాయిలో ఉత్సాహంగా ఉంటాడని తాను కూడా కోహ్లీ లాగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను అని వైశాఖ్ పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీతో పాటు పేసర్ మహ్మద్ సిరాజ్‌తో తనకున్న అనుభవాన్ని వ్యక్తపరిచాడు. RCB కోసం నా మొదటి మ్యాచ్ లో మంచి ప్రదర్శన చేశానని తెలిపిన వైశాక్ తర్వాతి మ్యాచ్ లో దారళంగా పరుగులు ఇచ్చుకున్నట్లు పేర్కొన్నాడు. ప్రతి మ్యాచ్ ను సవాల్ గా తీసుకుని నేర్చుకోవాలని మహ్మద్ సిరాజ్ తనకు చెప్పాడని వైశాఖ్ విజయ్‌కుమార్ అన్నారు. ఐపీఎల్ తో పాటు దేశవాలీ పోటీల్లో వైశాక్ అదరగొడుతున్నాడు. వైషాక్ IPL 2023 వేలంలో ఉన్నప్పటికి అమ్ముడుపోలేదు. రజత్ పాటిదార్ గాయపడటంతో అతని స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వైశాఖ్ ను జట్టులోకి తీసుకుంది.
తొలి ఐపీఎల్ టోర్నీలోనే 9 వికెట్లు తీసిన వైశాఖ్ విజయ్‌కుమార్ 2024 టోర్నీలో 4 వికెట్లు పడగొట్టాడు. 2024 రంజీ ట్రోఫీ టోర్నమెంట్‌లో, వైశాఖ్ విజయ్‌కుమార్ కర్ణాటక తరఫున బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. టోర్నమెంట్‌లో అతను 13 ఇన్నింగ్స్‌లలో 31.82 సగటుతో మరియు 72.82 స్ట్రైక్ రేట్‌తో 343 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించాడు. బౌలింగ్‌లో, అతను 16 ఇన్నింగ్స్‌లలో 23.61 సగటుతో 39 వికెట్లు తీశాడు. తద్వారా కర్ణాటక తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.