శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో స్పిన్నర్లపై బ్యాటింగ్‌లో వైఫల్యాన్ని చవిచూస్తున్న భారత మాజీ కెప్టెన్, ఆధునిక బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 2024 ICC T20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో టైటిల్ గెలిచిన తర్వాత, శ్రీలంకతో వన్డే సిరీస్‌లో పాల్గొనేందుకు వచ్చిన విరాట్ కోహ్లీపై చాలా అంచనాలు ఉన్నాయి. అయితే కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో 24 పరుగులు చేసి శుభారంభం అందించిన కోహ్లి.. స్పిన్నర్ వనిందు హసరంగకు వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత రెండో వన్డేలో 14 పరుగులు మాత్రమే చేసి జాఫ్రీ వాండర్సేకు వికెట్ లొంగిపోయాడు. రెండు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ కేవలం 38 పరుగులే చేశాడు.
తొలి మ్యాచ్ టైగా ముగియగా, రెండో వన్డేలో భారత జట్టు 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. అండ హాఘే తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ సన్నద్ధత సరిగా లేనట్లుందన్నాడు. విరాట్ కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మెన్, ప్రపంచంలోనే నెం.1 బ్యాట్స్‌మెన్, కానీ అతను రెండుసార్లు ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఇది అయ్యర్ లేదా దూబేకి జరిగితే అర్థం పెద్దగా పట్టించుకనే వాళ్లం కాదు. కానీ విరాట్ కోహ్లీకి జరిగింది. అతను సరిగా ప్రాక్టీస్ చేయలేదని అర్థమవుతోందని అని బాసిత్ అలీ అభిప్రాయపడ్డాడు.
ప్రస్థుతం ఉన్న టీమిండియా ప్రపంచంలోనే మంచి బ్యాటింగ్ లైనప్‌గా అనిపించడం లేదన్నారు. శ్రేయాస్ అయ్యర్ మరియు కెఎల్ రాహుల్ సరిగ్గా ప్రాక్టీస్ చేయకుండా సిరీస్ ఆడటానికి వచ్చారని. వారు ప్రాక్టీస్ చేయకుండానే శ్రీలంకకు వచ్చారు” అని పాకిస్తాన్ మాజీ ఆటగాడు విమర్శించాడు. శ్రేయాస్ అయ్యర్ ఈ విధమైన ప్రదర్శనతో ఏమి చేయబోతున్నాడో తనకు అర్థం కావడం లేదన్నాడు. రిషబ్ పంత్, ర్యాన్ పరాగ్ మరియు రింకూ సింగ్‌లకు జట్టులోకి రావడానికి సమయం ఆసన్నమైందన్నారు. గౌతమ్ గంభీర్‌కు ఈ పర్యటన చాలా ముఖ్యమైందని అన్నారు బాసిత్ అలీ.