టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమ్ ఇండియా మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. స్వదేశంలో అత్యల్ప స్కోరుకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న 3 మ్యాచ్‌ల టెస్టు క్రికెట్ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కేవలం 46 పరుగులకే ఆలౌటైంది. ఇక్కడి ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న రెండో రోజు మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు బ్యాట్స్మెన్ న్యూజిలాండ్ జట్టు ఫాస్ట్ బౌలర్ల ధాటికి పెవిలియన్ కు క్యూ కట్టారు.
ఓపెనర్ యశస్వి జైస్వాల్ (13) మరియు వికెట్ కీపర్ బ్యాట్స్ మాన్ రిషబ్ పంత్ (20) కాకుండా, మరే ఇతర బ్యాట్స్ మాన్ డబుల్ ఫిగర్స్లో స్కోర్ చేయలేదు. అంతే కాదు ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లను డక్స్ నమోదు చేశారు. విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఆర్ అశ్విన్, ఆర్ జడేజా మరియు సర్ఫరాజ్ ఖాన్ డక్ అవుట్ అయ్యారు.
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లు మాట్ హెన్రీ (5 వికెట్లు), విలియం ఓ రూర్కే (4 వికెట్లు) మరియు టిమ్ సౌతీ (1 వికెట్) టీమిండియా బ్యాటర్లను ఓ ఆట ఆడుకున్నారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమ్ ఇండియా 3 వ అత్యల్ప స్కోరుకు ఆలౌటయింది. ఆసియాలో ఏ జట్టుకయిన అదే అతి తక్కువ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు.
టెస్టుల్లో స్వదేశంలో టీమిండియా చేసిన అత్యల్ప స్కోరు
- 2024లో బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో 46 పరుగులకు ఆలౌట్
- 1987 లో ఢిల్లీలో వెస్టిండీస్ పై 75 పరుగులు
- 2008 లో అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాపై 76 పరుగులు
- 1999 మొహాలీలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో 83 పరుగులకు ఆలౌట్
- 1977లో చెన్నైలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 83 పరుగులకు ఆలౌట్
బ్యాటింగ్ ఎంచుకోవడమే తప్పదమా..!
మేఘావృతమైన వాతావరణంలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నాడు. చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో మొదటి రోజు మొదటి సెషన్‌లో ఫాస్ట్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా, టీమ్ ఇండియా గత కొన్ని రోజులుగా వర్షం కురిసిన నేపథ్యంలో బ్యాటింగ్ చేయడానికి ఎంచుకుని తగిన మూల్యం చెల్లించింది.
టీమిండియా అత్యల్ప స్కోరు
36 – ఆస్ట్రేలియా (అడిలైడ్, 2020)
42 – ఇంగ్లాండ్ (లార్డ్స్, 1974)
46 – న్యూజిలాండ్ (బెంగళూరు, 2024)
58 – ఆస్ట్రేలియా (బ్రిస్బేన్, 1947)
58 – ఇంగ్లాండ్ (మాంచెస్టర్, 1952)
66 – దక్షిణాఫ్రికా (డర్బన్, 1996)
67 – ఆస్ట్రేలియా (మెల్బోర్న్, 1948)