ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ను భారత మహిళల జట్టు పేలవంగా ప్రారంభించింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 160 పరుగులు చేసింది. అనంతరం చేదన ప్రారంభించిన టీమిండియా 19 ఓవర్లలో 102 పరుగులకే పరిమితమైంది. భారత్ రెండో మ్యాచ్ ఆదివారం పాకిస్థాన్‌తో జరగనుంది.
న్యూజిలాండ్‌పై 161 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ షఫాలీ వర్మ, స్మృతి మంధానలను ల వికేట్లను పవర్‌ప్లేలో కోల్పోయింది. తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ కాసేపు పర్వాలేదనిపించినా ఔటైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ అవుటైన వెంటనే టీమ్ ఇండియాపై ఒత్తిడి పెరిగి మిడిలార్డర్ బ్యాట్స్‌వుమెన్‌లు వరుసగా క్యూ కట్టారు.
భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ వైఫల్యం
భారత టాప్ ఆర్డర్ ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ టీమిండియా ఆటగాళ్లు గొప్పగా ఏం రాణించలేదు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో షఫాలీ వర్మ కేవలం 2 పరుగులు మాత్రమే చేయగలిగింది. మరో ఓపెనర్ స్మృతి మంధాన 12 పరుగులు చేయగా, హర్మన్‌ప్రీత్ కౌర్ 15 పరుగులు మాత్రమే చేసింది. ఇది కాకుండా, వార్మప్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన జెమీమా రోడ్రిగ్స్ న్యూజిలాండ్‌పై 13 పరుగులు మాత్రమే చేయగా, రిచా ఘోష్ మరియు దీప్తి శర్మ చెరో 13 పరుగులు చేశారు.
బౌలింగ్ వైఫల్యం
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ బౌలింగ్ లొ కూడా విఫలమయింది. పవర్ ప్లేలో భారత జట్టు బౌలర్లు ప్రత్యర్థి జట్టు వికెట్ తీయలేకపోయారు. న్యూజిలాండ్ ఓపెనర్లు తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించారు. దీని తర్వాత, సోఫీ డివైన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతలను చేపట్టింది అంతేకాదు వేగంగా పరుగులు చేసి టీమిండియా ముందు మంచి లక్ష్యాన్ని నిలిపింది. సోఫీ 57 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. టీమ్ ఇండియా బౌలింగ్ లో రేణుకా సింగ్ రెండు వికెట్లు, అరుంధతి రెడ్డి, ఆశా శోభన ఒక్కో వికెట్ తీశారు.. పేలవమైన బౌలింగ్, ఫీల్డింగ్ కూడా ఈ మ్యాచ్‌లో టీమిండియాకు తలనొప్పిగా మారింది.