ఇంగ్లాండ్ తో 5వ టెస్టుకు కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా, వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్‌, రోహిత్ శర్మ దూరం

BCCI Announced that Jasprit Bumrah to Lead India in 5th Test Against England Rohit Sharma Ruled Out, Jasprit Bumrah to Lead India in 5th Test Against England, Rohit Sharma Ruled Out, 5th Test Against England, Jasprit Bumrah to Lead India, BCCI Announced that Jasprit Bumrah to Lead India in 5th Test Against England, Jasprit Bumrah To Lead India In Fifth Test Vs England After Rohit Sharma Ruled Out Due To COVID-19, Jasprit Bumrah will be leading India for the first time in any format, Jasprit Bumrah Named India Captain For Rescheduled 5th Test Against England, Rescheduled 5th Test Against England, India VS England 5th Test Match News, India VS England 5th Test Match Latest News, India VS England 5th Test Match Latest Updates, India VS England 5th Test Match Live Updates, Mango News, Mango News Telugu,

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియంలో జూలై 1 నుంచి 5 వరకు ఐదవ రీషెడ్యూల్ టెస్ట్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ తో సిరీస్ లో భాగంగా నిర్ణయాత్మకమైన ఈ టెస్టుకు భారత్ జట్టులో కీలక మార్పు జరిగింది. ఇంగ్లాండ్ తో జూలై 1 మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమయ్యే 5వ టెస్టుకు భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమవడంతో, జట్టుకు పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేసింది. దీంతో 1987 లో కపిల్ దేవ్ తర్వాత భారత్ టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించిన పేసర్ గా జస్ప్రీత్ బుమ్రా రికార్డ్ సృష్టించాడు.

కెప్టెన్ రోహిత్ శర్మకు కోవిడ్-19 పాజిటివ్ గా తేలడంతో ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాడు. రోహిత్ శర్మ గురువారం ఉదయం ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేయించుకున్నాడని, మళ్ళీ కోవిడ్ పాజిటివ్ గానే తేలిందని బీసీసీఐ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఇంగ్లాండ్ తో టెస్టుకు జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్‌గా మరియు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ని వైస్ కెప్టెన్ గా ఎంపిక చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో 5 టెస్టుల టెస్ట్ సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్ పై 3 టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి ఇంగ్లాండ్ ఊపుమీదుండగా, ఈ టెస్టులో సత్తాచాటి సిరీస్ గెలుచుకునేందుకు భారత్ జట్టు సిద్ధమైంది.

భారత్ టెస్టు జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, ఛటేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్) (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్ , మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, మయాంక్ అగర్వాల్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − three =