మహ్మద్ షమీ ఆత్మహత్య చేసుకోబోయాడు: ఉమేష్ కుమార్

Umesh Kumar Said That Mohammed Shami Is Going To Commit Suicide ,Mohammed Shami Is Going To Commit Suicide ,Umesh Kumar Said Shami Is Going To Commit Suicide,Mohammed Shami,Umesh Kumar ,Suicide, Team India,Bowler,Mohammad Shami Suicide Attempt,Indian Cricketer Shami,Indian Cricketer,Indian Pacer Shami,Pacer Shami,Live Updates, Politics, Political News,Mango News,Mango News Telugu
umesh kumar, mohammed shami, suicide, team india

భారత జట్టు సీనియర్ పేసర్ మహమ్మద్ షమీపై ఉమేష్ కుమార్ అనే వ్యక్తి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మహ్మద్ షమీ తన జీవితంలో అత్యంత క్లిష్టతరమైన రోజుల్లో ఆత్మహత్య చేసుకోబోయాడని షమీ స్నేహితుడు ఉమేష్ కుమార్ వెల్లడించాడు. మహ్మద్ షమీ తన కెరీర్‌లో అత్యంత కఠినమైన కాలంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నాడని.. ఆ సమయంలో అతను తనతోనే ఉన్నాడని షమీ ఉమేష్ కుమార్ చెప్పాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా షమీ మానసికంగా కుంగిపోయాడని.. రాత్రంతా నిద్రపోలేదని పేర్కొన్నాడు.

ఫిక్సింగ్ ఆరోపణల వార్త తెలియగానే, మహ్మద్ షమీ ఆ రాత్రి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తెల్లవారుజామున 4 గంటలకు, నేను నీరు త్రాగడానికి నిద్రలేచాను. నీళ్ళు త్రాగడానికి వంటగదికి వెళుతుండగా, షమీ నిల్చుని ఉండటం చూశాను. బాల్కనీలో 19వ అంతస్తులో ఉన్నాం.. ఆ రోజు ఏం జరిగిందో నాకు అర్థమైంది.. షమీ కెరీర్‌ గురించి చాలాసేపు ఆలోచించాను అని ఉమేష్ కుమార్ అన్నాడు. మహ్మద్ షమీ మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు కీలక పేసర్. వన్డే, టెస్టు క్రికెట్‌లో భారత జట్టుకు షమీ ఎన్నో మ్యాచ్‌లు గెలిచాడు. ఆస్ట్రేలియా బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ, ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్‌ విజయంలో షమీ కీలక పాత్ర పోషించాడు. అంతే కాకుండా 2023 వన్డే ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా నిలిచాడు.

2023 ODI ప్రపంచ కప్ టోర్నమెంట్ తర్వాత, మొహమ్మద్ షమీ చీలమండ గాయం కారణంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఇటీవలే టీమిండియా నూతన కోచ్ గంభీర్ సైతం షమీ త్వరలోనే జాతీయ జట్టులోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌లకు షమీ భారత జట్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE