డిసెంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే అడిలైడ్ టెస్ట్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. అయితే, విరాట్ కోహ్లీ మోకాలికి బ్యాండేజీతో ప్రాక్టీస్ చేయడం, తర్వాత మైదానాన్ని మధ్యలో విడిచి వెళ్లిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రాక్టీస్ సెషన్‌లో మోకాలి నొప్పి కారణంగా కోహ్లీకి మెడికల్ ట్రీట్‌మెంట్ అందించినట్లు సమాచారం.
కోహ్లీ ప్రస్తుతం పింక్ బాల్ టెస్ట్‌కు ప్రిపేర్ అవుతున్నప్పటికీ, అతని మోకాలి గాయం తీవ్రతను టీమ్ మేనేజ్‌మెంట్ గమనిస్తోంది. కోహ్లీ అడిలైడ్ మైదానంలో అత్యద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. 8 మ్యాచుల్లో 63 సగటుతో 509 పరుగులు చేసిన ఈ స్టార్ బ్యాటర్ మ్యాచ్ నుంచి తప్పుకుంటే, జట్టుపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది.
టెన్షన్‌లో ఫ్యాన్స్
కోహ్లీ మోకాలి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు అతని గాయం గురించి ఆందోళన చెందుతున్నారు. “కంగారూలను ఏడిపిస్తాడనుకున్నాం, కానీ ఇప్పుడు మనల్ని భయపెడుతున్నాడు,” అంటూ కామెంట్లు చేస్తున్నారు. టీమిండియా అతను పూర్తిగా కోలుకొని మైదానంలో మెరవాలని ఆశిస్తోంది.
VIRAT KOHLI – THE FAVOURITE OF AUSTRALIAN PUBLIC 🐐 pic.twitter.com/xlQAEJH69h
— Johns. (@CricCrazyJohns) December 3, 2024