అదుపులోకి 17 మంది విదేశీ యువతులు…

A High Tech Prostitution Gang Has Been Arrested In Hyderabad 17 Foreign Young Women Detained, High Tech Prostitution Gang, Prostitution In Hyderabad, Hyderabad 17 Foreign Young Women Detained, Foreign Young Women Gang Prostitution, Gachibowli, Hyderabad, Prostitution, Prostitution Gang Has Been Arrested, Prostitution Gang Arrested, Hi-tech Prostitution Gang Arrested, Gachibowli Police Raid, Hyderabad, Hyderabad, Hyderabad Live Updates, Latest Hyderabad News, Telangana, TS Politics, TS Live Updates, Political News, Mango News, Mango News Telugu

హైదారాబాద్‌లో గుట్టుగా సాగుతున్నహైటెక్ వ్యభిచార ముఠాను పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కొండాపూర్‌లోని ఒక ఇండిపెండెంట్ హౌస్‌లో ఈ గలీజు దందాను నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో గచ్చిబౌలి, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ఇండిపెండెంట్ ఇంట్లో.. ఊహించని రీతిలో ఎక్కువగా విదేశీ యువతులు కనిపించారు. కెన్యా దేశానికి చెందిన 14 మంది, యుగాండా, టాంజానియా దేశాలకు చెందిన ముగ్గురిని.. ఇలా మొత్తంగా 17 మంది విదేశీ యువతులను పోలీసులు అదుపులోకి తీసుకుని సేఫ్ హౌస్‌కు తరలించారు. కాగా.. ఈ చీకటి దందాను నడిపిస్తున్న నిర్వాహకుడు శివ కుమార్‌తో పాటు ఇద్దరు విటులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

నిర్వాహకుడు శివ కుమార్‌ ఇంటర్నేషనల్ లెవల్‌లో వెబ్‌సైట్‌కు క్రియేట్ చేసి.. అందులో విదేశీ యువతుల ఫోటోలు పెట్టి మరీ దందా నడిపిస్తున్నాడు. “లో కెన్ టో” అనే వెబ్‌సైట్‌లో విదేశీ యువతుల ఫోటోలు పెట్టి.. విటులను ఆకర్షిస్తున్న నిర్వాహకుడు శివకుమార్. దాడిలో భాగంగా.. 4 మొబైల్ ఫోన్‌లు, 25 హెచ్‌ఐవీ కిట్లు, మూడు సెక్స్ టాయ్స్, హుక్కా పాట్స్‌తో పాటుగా 20 వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో ఇలాంటి హైటెక్ వ్యభిచారం జరుగుతుందని సమాచారం. ఇప్పటికే డ్రగ్స్ కేసులో చాలా మంది విదేశీయులు అరెస్టయిన విషయం తెలిసిందే. ఇప్పుడు విదేశాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచార కూపంలోకి దింపుతూ.. వారితో చీకటి వ్యాపారం చేస్తుండటంతో హైదరాబాద్ లో ఇల్లీగల్ కార్యకలాపాలు ఎక్కువయ్యాయని అనుమానాలు రాకమానదు. ఇప్పటికైతే ఇది వెలుగులోకి రాగా.. ఇలాంటివి ఇంకా ఎన్ని చీకటి దందాలు నడుస్తున్నాయన్నది పోలీసులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.