ఎన్టీఆర్ వంద అడుగుల విగ్రహం

A Hundred Feet Statue Of NTR

సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు గారి విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని.. టీడీ జనార్ధన్ తెలిపారు. గతంలో టీడీపీని స్థాపించిన చోటే వంద అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. తెలుగు వారు అందరూ ఏకం కావాలనే లక్ష్యంతో ఎన్టీఆర్‌ తెలుగు దేశం పార్టీని స్థాపించారు.

తెలుగు వారు అందరూ ఏకం కావాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించారు. టీడీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. NTR చేసిన సేవలకు ప్రపంచ దేశాల నుంచి ఇప్పటికే మంచి గుర్తింపు వచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్ నగరంలో అన్నగారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలుగు ప్రజలకు అంకితమిస్తామని ఈ సందర్భంగా వారు చెప్పుకొచ్చారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయం తో టీడీపీ శ్రేణుల్లో , నేతల్లో మల్లి ఉత్సాహం మొదలైంది. ఈ విజయం తో తెలంగాణ లో కూడా టీడీపీ కి పూర్వ వైభవం తీసుకరావాలని చంద్రబాబు భావిస్తున్నాడు. ఈ క్రమంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని హైదరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేయాలని పార్టీ నాయకులు నిర్ణయించారు.