హోటల్ లో బందించి 20 రోజులుగా లైంగిక దాడి..

A Young Man Has Been Sexually Assaulting A Young Woman For 20 Days After Keeping Her In A Hotel In Hyderabad, Sexually Assaulting, 18-Yr-Old Girl Locked In Hotel Room, Minor Girl Confined And Sexually Harassed, Hyderabad Minor Allegedly Kidnapped, Hyderabad, Instagram, Young Man Has Been Sexually Assaulting Young Woman, Hyderabad Live Updates, Latest Hyderabad News, Telangana, TS Politics, TS Live Updates, Political News, Mango News, Mango News Telug

హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఓ యువతిని హోటల్ లో బందించి 20 రోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. చివరకు తల్లిదండ్రులకు లైవ్ లొకేషన్ షేర్ చేయడంతో పోలీసులు వచ్చి యువతిని రక్షించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.

భైంసాకి చెందిన బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఆ యువకుడు హైదరాబాద్నగరంలో సాఫ్ట్‌వేర్ కోర్సు చేస్తున్నాడు. అతని ట్రాప్‌లో చిక్కుకున్న బాలికకు పెళ్లిపేరిట మాయమాటలు చెప్పి బలవంతంగా హైదరాబాద్ నగరానికి రప్పించాడు. నారాయణగూడలోని ఓ హోటల్‌ గదిలో 20 రోజులుగా నిర్బంధించి, లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఆ బాలిక కోరడంతో హోటల్ రూంకుకు తాళం వేసి, అక్కడ నుంచి పరారయ్యాడు యువకుడు. తీరా పెళ్లి పేరు ఎత్తగానే హోటల్ గదిలో ఆ అమ్మాయిని బంధించి పరారయ్యాడు. ఎట్టకేలకు బాలిక, తన ఫోన్‌ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అదించి, వాట్సాప్‌లో లోకేషన్‌ షేర్‌ చేసింది.

ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్‌ చేరుకుని షీ టీమ్స్‌, నారాయణగూడ పోలీసులను ఆశ్రయించారు. బాలికపై జరుగుతున్న అఘాయిత్యం గురించి తెలుసుకున్న షీటీమ్స్‌ సిబ్బంది ఆదివారం సాయంత్రం బాలికను రక్షించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ అమ్మాయి ఫిర్యాదుతో యువకుడిని అరెస్ట్ చేసిన నారాయణ గూడ పోలీసులు, రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా నగరంలోని హోటల్స్ నేరాలకు అడ్డాలుగా మారుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా యాజమాన్యాల సాయంతోనే నేరాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇటీవల అలాంటి ఓ కేసు సంచలనంగా మారింది. శంషాబాద్‌లోని ఓ హోటల్ యజమాని అశ్లీలవీడియోలకు బానిసయ్యాడు. అదే వంకర బుద్ధితో హోటల్ గదుల్లో చిన్న చిన్న కెమెరాలు అమర్చాడు. అక్కడికి వస్తున్న ప్రేమ జంటల వీడియోలను తీసి వాటని చూపించి బెదిరించి డబ్బులు డిమాండ్ చేసేవాడు. ఏడాది నుంచి వందల కొద్దీ వీడియోలు సేకరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. అసలు విషయం బయటకు రావడంతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు నగరంలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ట్రయల్ రూంలో స్పై కెమెరాను ఓ మహిళ గమనించి యజమానికి ఫిర్యాదు చేసింది. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి అది ఏర్పాటు చేసినట్లు గుర్తించి ఆ మహిళకు కొంత పరిహారం అందించి పంపించేశాడు.

రహస్య కెమెరాలతో భయాందోళనకు గురిచేస్తున్న షాపింగ్ మాల్స్, హోటళ్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. బాధితులు ఎవరైనా ఉంటే డయల్ 100కు ఫోన్ చేయాలని.. మరోవైపు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న స్పై కెమెరాల ద్వారా బగ్ డిటెక్టర్ ద్వారా గుర్తించే అవకాశం ఉందని ఆయన సూచించారు. అయితే మహిళాల భద్రత విషయంలో రాజీ పడేది లేదని సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేస్తే సహించేది లేదని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.