మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్లో యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన ఇంకా మరవకముందే.. ఇప్పుడు నిజామాబాద్ లో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. నిజామాబాద్ బస్టాండ్ సమీపంలో మొన్న రాత్రి నలుగురు దుండగులు ఒంటరిగా ఉన్న ఓ మహిళను నలుగురు వ్యక్తులు ఆటోలో అక్కడి నుంచి డిచ్‌పల్లి ప్రాంతానికి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలు నగరానికి చేరుకుని శనివారం ఉదయం జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఈ అత్యాచారానికి పాల్పడిన వారు డిచ్‌పల్లికి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధిత మహిళను వెంటబెట్టుకుని ఘటనాస్థలికి తీసుకెళ్లి పోలీసులు పరిశీలించారు. బస్టాండ్ వద్ద ఆటోకు సంబంధించిన సీసీ కెమెరాలో రికార్డయిన వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిజామాబాద్‌లో ఈ ఘటన సంచలనం రేపింది. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని స్థానికులు, మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రాత్రి వేళ పోలీసుల పెట్రోలింగ్ పెంచాలని కూడా వారు కోరుతున్నారు.
వరుస ఘటనలతో కలవరం : 20 రోజుల క్రితం వరంగల్‌లో కూడా ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె నమ్మిన స్నేహితుడే బలవంతంగా తీసుకెళ్లి తన మిత్రులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. మాట్లాడే పని ఉంది రావాలంటూ కారులో ఎక్కించుకొని వరంగల్‌లోనే ఓ హోటల్‌కు తీసుకెళ్లి స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. పోలీసులు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.