తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 894 కరోనా కేసులు నమోదు

Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, Mango News Telugu, telangana corona district wise cases, telangana coronavirus cases district wise, telangana coronavirus cases today, telangana coronavirus district wise, Telangana Coronavirus News, telangana covid cases today bulletin, telangana covid cases today list

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 894 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 894 కేసులతో కలిపి నవంబర్ 19, గురువారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,61,728 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఈ వైరస్ వలన ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1423 కి పెరిగింది.

మరోవైపు కరోనా నుంచి కోలుకుని ఇప్పటికి 2,47,790 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా, గత 24 గంటల్లో 1057 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 12,515 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటికే 50 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు. గురువారం నాడు 39,448 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 50,50,612 కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 1,35,696 పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + one =