తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్స్‌లో విద్య, ఉపాధ్యాయ శిక్షణను మెరుగుపరిచే విధంగా..డిజిటల్ కార్యక్రమాలు, ఆర్టిషిఫియల్ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీని కోసం విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా నేతృత్వంలోని బృందం, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నరసింహా రెడ్డి అక్టోబర్ 30న బెంగళూరులో ఏక్ స్టెప్ ఫౌండేషన్‌ను సందర్శించారు..
ప్రభుత్వ పాఠశాల విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంచడానికి ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటల్ పద్ధతులను విస్తృతంగా ప్రవేశపెట్టడానికి తెలంగాణ గవర్నమెంట్ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గైడెన్స్‌లో, పాఠశాల విద్యా శాఖ ఆధునిక విద్యా విధానాలను అమలు చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ దిశగా బెంగుళూరు కేంద్రంగా పని చేసే ఏక్ స్టెప్ ఫౌండేషన్ సర్వీసులను తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఫౌండేషన్ ఇప్పటికే విద్యా రంగంలో డిజిటల్ పరిష్కారాలను అందిస్తూ.. గుజరాత్, కర్ణాటక, ఒడిశా, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది.
జనవరి 30న తెలంగాణ విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా నేతృత్వంలోని ప్రతినిధలు టీమ్ ..ఏక్ స్టెప్ ఫౌండేషన్ ను సందర్శించింది. ీ టీమ్ లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహా రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్లు ఉమా హారతి, గరిమ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత డిజిటల్ విద్యా విధానాలు, స్కూలు విద్యలో నూతన అభ్యాస పద్ధతులు, డేటా ఆధారిత అధ్యయన విశ్లేషణలు, ఉపాధ్యాయుల శిక్షణా విధానాలు వంటి అంశాలపై చర్చలు జరిగాయి.