ఏపీలో వైసీపీ సర్కార్ గద్దె దిగిపోయి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలయింది. ఈక్రమంలో గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అరాచకపు పాలన అంతమయిందని కొందరు అంటుంటే.. అహంకారపు పాలనకు ప్రజలు చరమగీతం పాడారని మరికొందరు అంటున్నారు. ఇదే సమయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ తెలంగాణ నాయకుడు బండి సంజయ్.. గత వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పాలకులు వీరప్పన్ వారసులు అని విమర్శించారు. శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం తన పుట్టినరోజు సందర్భంగా బండి సంజయ్ తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై భగ్గుమన్నారు. శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయి.. స్వామివారికి నిత్యం సేవ చేసే పాలకులు ఇచ్చారని బండి సంజయ్ వెల్లడించారు. తిరుమల కొంపై అరాచక పాలన ముగిసిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో భక్తులు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమలలో పరిస్ధితులన్నీ చక్కబడ్డాయని వెల్లడించారు. శ్రీవారి ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని అన్నారు.
అలాగే వైసీపీ పాలకులను వీరప్పన్ వారసులుగా పేర్కొన్నారు. ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను దోచుకొని.. ఆ డబ్బుతో రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారని అన్నారు. శేషాచలం కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరుతామని.. దాని ఆధారంగా జాతీయ సంపదు దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ నేతలు పోరాటాలు చేశారని బండి సంజయ్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE