బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరుతున్న నాయకుల సంఖ్య ఇప్పట్లో తగ్గేలా లేదు. ప్రతి రెండు రోజులకో ఎమ్మెల్యే కారు దిగి హస్తం పార్టీ కి జై కొడుతున్నారు. ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఇక ఎంత మంది కారు దిగతారు? కేసీఆర్‌కి హ్యాండ్ ఇస్తున్న ఎమ్మెల్యేల జాబితాలో ఇంకెవరున్నారు..? హస్తం పార్టీలోకి వెళుతున్న వలసల సంఖ్య ఇక్కడితో ఆగుతుందా, ఇంకెంత మంది పార్టీ మారతారు.. అనేది ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులను కలవరపెడుతోంది.
శాసనసభ ఎన్నికల్లో 64 సీట్లు సాధించి అధికారిక పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్.. కొంత కాలానికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు అనుగుణంగానే ఇప్పుటికి ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకువచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు. దీంతో ఆ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, క్యాడర్ లో కలవరం మొదలయింది. ఎమ్మెల్యే, ఏ నాయకుడు ఎప్పుడు ఎక్కడికి వెళుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేల ఫిరాయింపులకు అడ్డుకట్ట వేసేందుకు బీఆర్ఎస్ నాయకత్వం స్వయంగా రంగంలోకి దిగింది. పార్టీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్యేలతో భేటీ అవుతూ.. పార్టీ మారొద్దని సూచిస్తున్నారు. వచ్చేది మన ప్రభుత్వమే వారికి భరోసా ఇస్తున్నారు.
కాని మరో 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఇక హరీశ్‌రావుతో కలిసి కొందరు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారట. ఇటు బీజేపీ కూడా పుంజుకుంటుండటంతో బీఆర్ఎస్ నాయకులు కొందరు కమలం పార్టీ వైపు కూడా చూసే అవకాశం లేకపోలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం అయోమయంలో పడింది. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి పార్టీలో నాయకులను కాపాడుకుంటేనే అసలైన ప్రతిపక్ష పాత్ర పోషించవచ్చు. లేదంటే కాంగ్రెస్ నాయకులు చెబుతున్నట్లు బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్ తప్ప ఎవరూ మిగిలరని చెబుతున్నట్లు.. ఆ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడవచ్చు.
ఇక మరోవైపు కాంగ్రెస్ లో అసంతృప్తులు మొదలయ్యాయి. బీఆర్ఎస్ నుంచి వలసలు ప్రారంభం కావడంతో కాంగ్రెస్ సీనియర్లలో కలకలం మొదలైంది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను, నేతలను పార్టీలో చేర్చుకోవడంపై అధికార కాంగ్రెస్ నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చేరికల విషయంలో కాంగ్రెస్ సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తమకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలను చేర్చుకుంటున్నారని, పార్టీని నమ్ముకున్న తమ పరిస్థితి ఏమిటని కొందరు సీనియర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.సంజయ్ ని పార్టీలో చేర్చుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి అలకబూనారు. 40 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేసిన తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా చుర్చుకున్నారని బహిరంగగానే అసంతృప్తి వెళ్లగక్కాకరు. ఇప్పుడు బీర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చని మిగితా నియోజకవర్గాల్లో ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. అటు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లోకి వెళ్లడం ఇటు కాంగ్రెస్ లో చేరడంపై నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఇలా తెలంగాణ రాజకీయాలు ఎన్నికల తరువాత కూడా హాట్ హాట్ గా సాగుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY