మంత్రి హరీష్ రావుకు పుత్రోత్సాహం.. కొలరాడో యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్‌లో పట్టా అందుకున్న తనయుడు అర్చిష్మాన్‌

Minister Harish Rao Announces His Son Archishman Gets Graduation Patta in Civil Engineering From Colorado University US,Minister Harish Rao Announces His Son Archishman,Archishman Gets Graduation Patta,Graduation Patta in Civil Engineering,Civil Engineering From Colorado University US,Mango News,Mango News Telugu,Minister Harish Rao,Archishman,Minister Harish Rao Latest News And Updates,Colorado University US,Archishman Studied In US

తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పుత్రోత్సాహంతో ఉన్నారు. ఆయన తనయుడు అర్చిష్మాన్‌ అమెరికాలోని ప్రతిష్టాత్మక కొలరాడో యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో పట్టా అందుకున్నాడు. ఈ సందర్భంగా.. మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. ట్విట్టర్‌లో మంత్రి ఇలా తెలిపారు.. నా కుమారుడు అర్చిష్మాన్ బౌల్డర్‌లోని కొలరాడో విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. అలాగే గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. దీనిని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. అయితే నేను నా కుమారుడి అద్భుతమైన విజయాన్ని గురించి మరీ ఎక్కువగా పొంగిపోవడం లేదు. ఎందుకంటే, ఇది అతని పట్టుదలకు మరియు వైవిధ్యాన్ని సాధించాలనే అభిరుచికి నిదర్శనం. ఈ నైపుణ్యంతో, ఆర్చిష్మాన్ ప్రపంచంలో సానుకూల ప్రభావాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘనత సాధించినందుకు ప్రియమైన అచ్చుకి అభినందనలు’ అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =