తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ఫోకస్ పెంచుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో కొత్త పీసీసీ అధినేతతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్‌తో సమావేశమై కొన్ని కీలకమైన అంశాలపై చర్చించారు. జులై నెలలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వం కొన్ని బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. దీంతో అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌తో పాటు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులకు సంబంధించి గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది.
అంతేకాదు మరోవైపు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణతో పాటుగా టీపీసీసీ చీఫ్ నియామకం కూడా ఉంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఉండవని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు కాంగ్రెస్ బీ ఫామ్‌పై పోటీ చేసిన వారికి మాత్రమే మంత్రిగా అవకాశం ఉంటుందని కూడా రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.
ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండగా..నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో చోటు దక్కనే లేదు. ఇప్పుడు ఆ జిల్లాల వారికి చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. దీంతో మైనారిటీ కోటాలో ఇప్పుడు ఎవరికి అవకాశం దక్కబోతుందన్న దానిపై చర్చ నెలకొంది.
మొత్తంగా రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుందో అన్న చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపైన తాజాగా ఢిల్లీలో సుదీర్ఘ కసరత్తు జరిగింది. రెడ్డి సామాజిక వర్గానికి సీఎం పదవి ఉండటంతో.. పార్టీ పదవి మాత్రం బీసీలకు ఇవ్వాలని మెజారిటీ కాంగ్రెస్ నేతలు కోరుతున్నారట.ఇటు ఈ పదవి కోసం మహేష్ కుమార్‌గౌడ్, మధుమాష్కీగౌడ్ పేర్లను పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY