అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై

Governor Tamilisai Made Sensational Comments at the Assembly Stage,Governor Tamilisai Made Sensational Comments,Sensational Comments at the Assembly Stage,Governor Tamilisai at the Assembly Stage,Governor, Governor Tamilisai, Telanagana Assembly, Congress,Mango News,Mango News Telugu,Tamilisai Soundararajan,Governor Tamilisai Sensational Comments,Governor Tamilisai Latest News,Governor Tamilisai Latest Updates,Governor Tamilisai Live News
Governor, Governor Tamilisai, Telanagana Assembly, Congress

తెలంగాణలో రాచరిక, నిరంకుశ పాలన అంతమైందని.. ప్రజా పాలన మొదలయిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించరని చెప్పారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య అడ్డుగా ఉన్న కంచెలు తొలగిపోయాయని వెల్లడించారు. తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తమిళిసై సౌందరరాజన్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కొత్త ప్రభుత్వాన్ని కోరారు. రాచరిక పాలనపోయి.. ఇది సామాన్యుడి ప్రభుత్వమని గర్వంగా చెప్పే పరిస్థితి వచ్చిందని తమిళిసై వెల్లడించారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. కాంగ్రెస్ పాలన దేశానికే ఆదర్శం కాబోతోందని చెప్పారు.

ఆమరవీరుల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని పాలన సాగిస్తామని వివరించారు. ప్రజా సంక్షేమం కోసమే ఆరు గ్యారెంటీలను ప్రకటించామని.. హామీలకు చట్టబద్ధత కల్పించే దస్త్రంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారని చెప్పారు. తొలి అడుగులోనే సంక్షేమానికి తమ ప్రభుత్వం నాంది పలికిందన్నారు. బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోపే రెండు గ్యారెంటీలు అమలు చేశామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతిమాటకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని వెల్లడించారు.

వచ్చే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలుకు కార్యాచరణ రూపొందిస్తామని.. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని గవర్నర్ చెప్పుకొచ్చారు. ప్రజల ఆరోగ్య భద్రత తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమన్న తమిళిసై.. రాజీవ్ ఆరోగ్యశ్రీని ప్రస్తుత అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిధిని రూ. 10 లక్షలకు పెంచామని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని.. ఇది అత్యంత పారదర్శకంగా ఉంటుందని తమిళిసై చెప్పారు. గత పాలకులు తొమ్మిదేళ్లలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు.  కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేపడతామని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =