ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటామని సీఎం అన్నారు. ఎల్లప్పుడూ సంతోషకరమైన మరియు సంపన్నమైన జీవితాన్ని గడపడానికి, కరోనా మహమ్మారిని అధిగమించడానికి అమ్మవారు తెలంగాణ ప్రజలను ఆశీర్వదించాలని సీఎం ప్రార్థించారు. తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. “చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుంది. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు కలగాలని, అన్నింటా విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు” అని సీఎం వైఎస్ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu






































