నా కడ శ్వాస వరకు రాజకీయాల్లోనే ఉంటా, యువశక్తి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్

JanaSena Chief Pawan Kalyan Speech at Yuva Shakti Public Meeting at Ranasthalam Srikakulam, Yuva Shakti Public Meeting at Ranasthalam Srikakulam, JanaSena Chief Pawan Kalyan Speech at Yuva Shakti Public Meeting, Pawan Kalyan Speech at Yuva Shakti Public Meeting, Yuva Shakti Public Meeting, Ranasthalam Yuva Shakti Public Meeting, JanaSena Chief Pawan Kalyan Speech, Yuva Shakti Public Meeting News, Yuva Shakti Public Meeting Latest News And Updates, Yuva Shakti Public Meeting Live Updates, Mango News, Mango News Telugu

జనసేన పార్టీ ఆధ్వర్యంలో నేడు రణస్థలంలో నిర్వహించిన ‘యువశక్తి’ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. యువశక్తి సభకు జనసైనికులు, వీర మహిళలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ముందుగా ఎవడ్రా మనల్ని ఆపేది అంటూ పవన్‌ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. యువత బంగారు భవిష్యత్తు కోసం బాధ్యతగా పనిచేస్తామని తెలిపారు. రణస్థలం వేదికగా మాట ఇస్తున్నానని, తన కడ శ్వాస వరకు రాజకీయాల్లోనే ఉంటానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్రతో తనకు ప్రత్యేకమైన అనుభందం ఉందని, నటనలో ఓనమాలు ఇక్కడే నేర్చుకున్నానన్నారు.

ఎవర్నో తిట్టడానికి సభ పెట్టలేదని, యువత కోసం యువశక్తి సభ పెట్టామని అన్నారు. విద్య, వైద్యం కొంతమందికేనా? మాకు ఎందుకు అందడం లేదు అన్న యువత ఆవేదన నుండి ఈ యువశక్తి సభ పెట్టాలనే ఆలోచన వచ్చిందన్నారు. రాజకీయాల్లో ఉన్న ప్రతీ ఒక్కరూ ఏదో ఒక వ్యాపారం చేస్తూ చేస్తున్నారని, తాను సినిమాలు చేస్తూ రాజకీయం చేస్తున్నానని, సినిమానే తనకు తెలిసిన పని అని, పార్టీ నడపడానికి ఖర్చు ఉంటుందన్నారు. విడిపోయిన రాష్ట్రమైన ఏపీ, కూలిపోయిన రాజ్యం, రాజధాని లేని రాజ్యం, జీతాలు లేని ఉద్యోగులు, ఉపాధి లేని యువతగా మారిందన్నారు.

ఇదో మూడు ముక్కల ప్రభుత్వం, ఆయనొక మూడు ముక్కల ముఖ్యమంత్రి అని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. మీ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎదుర్కొన్నాను, అప్పుడే పంచలు ఊడదీసి కొడతాను అని సవాల్ చేశా, ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్న వాడినని అని పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. చాలా కాలం క్రితం తీవ్రవాద ఉద్యమాల ద్వారా మాత్రమే మార్పు వస్తుంది అని అనుకుని అక్కడ దాకా వెళ్ళడానికి నిర్ణయించుకుని ఆగిపోయిన వాడినని, అప్పుడు ఇప్పుడు అదే తెగింపు తనలో ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. అందరిలా కాంప్రమైజ్ అయి బ్రతికే వాడిని కాదన్నారు. ప్యాకేజ్ అని వాగే వాళ్ళంతా, తన దగ్గరగా వచ్చి ప్యాకేజ్ అని వాగాలని, అప్పుడు తాను ఏం చేస్తానో చూస్తారని పవన్ కళ్యాణ్ అన్నారు. తనను వ్యక్తిగతంగా విమర్శించే వారందరి జీవితాలు తనకు తెలుసు అని, వారితో పోలిస్తే తాను దేవుడినని చెప్పుకోవాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

“నేను జనాలను నమ్మి రాలేదు, నా కుటుంబం అనుకుని వచ్చాను, నా కుటుంబసభ్యులు అయిన జనం నాకోసం నిలుస్తారా లేదా అనేది మీరు చెప్పాలి. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే గెలిపిస్తాము అనే భరోసా ప్రజలు ఇస్తే ఒంటరిగా వెళ్దాం. మనకి గౌరవం ఉంటేనే ఏదైనా, గౌరవం లేకపోతే ఏ పొత్తు ఉండదు” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + twenty =