ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మానవజాతి ప్రగతికి సంస్కృతి, ప్రతిబింబంగా నిలుస్తుందని అన్నారు. విభిన్న మతాలు, కులాలు, భాషలు, జీవన విధానాలు, కట్టు, బొట్టు, ఆహార వ్యవహారాలతో కూడిన భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తున్న భారతీయ సంస్కృతి, మహోన్నతమైనదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలోని భిన్న సంస్కృతులకు కేంద్రంగా, జీవన వైవిధ్యానికి వేదికగా, మినీ ఇండియాగా తెలంగాణ నిలవడంలో ఇక్కడి సాంస్కృతిక జీవన విధానం, దండలో దారమై కొనసాగుతున్నదన్నారు.
గంగా-జమున తెహజీబ్ కు ప్రతీకగా నిలిచిన తెలంగాణ సంస్కృతి, ప్రపంచ సాంస్కృతిక జీవన విధానానికి ఆదర్శమని సీఎం తెలిపారు. తెలంగాణ సంస్కృతికి పెద్ద పీట వేస్తూ తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలుపరుస్తున్నదని, భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో తెలంగాణ ఘనతను ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎత్తి పడుతున్నదని సీఎం అన్నారు. సబ్బండ వర్గాల భాష, సంప్రదాయ, సాంస్కృతిక, అస్తిత్వ జీవన తాత్వికకు తెలంగాణ ప్రభుత్వం పబ్బతి పడుతున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ