బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయంపై కాంగ్రెస్ ఎంపీల ధర్నా

Congress MPs Staged A Dharna Saying Injustice Was Done To Telangana In The Central Budget,Telangana In The Central Budget,Congress MPs Staged A Dharna Saying Injustice,Injustice Was Done To Telangana,Telangana,Congress MPs , Central Budget,Criticizes Central Budget Allocation For Telangana In Legislative Assembly, Criticizes Central Budget Allocation For Telangana,KTR,Telangana,Central Budget,Assembly, Central Budget Allocation, Telangana Budget, Telangana Infrastructure, Telangana Legislative Assembly, Telangana Local Reservation, Telangana Medical Colleges,Live Updates, Politics, Political News,Mango News,Mango News Telugu,
Congress MPs, Telangana, central budget, congress

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరగడంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణ బీజేపీపై ఒత్తిడి పెంచుతున్నాయి.  ఢీల్లీ వేదికగా కాంగ్రెస్‌ ఎంపీలు ధర్నా చేపట్టారు.  బడ్జెట్ సవరణ చేసి తెలంగాణకు నిధులు కేటాయించాలని, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని బీజేపీ ఎంపీలు వమ్ము చేశారన్నారు. కేంద్రమంత్రివర్గంలో తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నప్పటికీ న్యాయం జరగలేదన్నారు. విభజన చట్టం 2014లో ఉంటే నాటి నుంచి లేని కేటాయింపులు ఈసారి బడ్జెట్‌లోనే ఎందుకు చేశారో చెప్పాలన్నారు. ప్రధాని తన కుర్చీ కాపాడుకునేందుకే బడ్జెట్ లో నితీశ్, చంద్రబాబు రాష్ట్రాలకు న్యాయం చేశారు. లోకసభ ఎన్నికల్లో బిజెపికి సహకరించిన బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ఎమ్.పిలు తెలంగాణకు జరిగిన అన్యాయం పై పోరాటం చెయ్యాలని తెలిపారు. ఈ ధర్నాలో నాగర్‌ కర్నూల్‌ ఎంపీ డా.మల్లు రవి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ పాల్గొన్నారు.

తెలంగాణ కు బడ్జెట్ లో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ప్రధాని, కేంద్ర ఆర్ధికశాఖ మంత్రికి లేఖలు రాస్తున్నామని నాగర్ కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులను మేము వ్యతిరేకించడం లేదన్నారు…కానీ తెలంగాణకు కేటాయింపులు జరపమని కోరుతున్నామన్నారు. రాష్ట్రప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్, బీజెపీతో రాజీపడిందన్నారు. బడ్జెట్ పై చర్చ సంధర్భంగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని లేవనెత్తుతామన్నారు. తెలంగాణకు న్యాయం జరిగేంతవరకు పార్లమెంట్‌లో పోరాటం చేస్తామన్నారు. తెలంగాణలోని పాత జిల్లాల్లో 9 జిల్లాలకు వెనుకబడిన ప్రాంత నిధులు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆ హామీ గురించి ఎటువంటి ప్రస్తావన లేదన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే అమలు చేసేలా బడ్జెట్ లో హామీలు, కేటాయింపులు ఉన్నాయని అన్నారు.

తెలంగాణకు అన్యాయం జరగడంపై కూడా సోషల్ మీడియాలో కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. తొలిసారిగా తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచినా తెలంగాణకు అన్యాయం చేయడంపై చాలా మంది బీజేపీని నిలదీస్తున్నారు. దీంతో బీజేపీ ఎంపీలు ఒత్తిడిలో పడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణకు కేటాయింపులు జరిగాయని చెప్పినప్పటికీ బీజేపీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ