తెలంగాణలో కొత్తగా 3801 మందికి కరోనా పాజిటివ్, జీహెచ్‌ఎంసీలోనే అధికం

Covid-19 in Telangana : 3801 New Positive Cases, 2046 Recoveries Reported on JAN 26th

తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 3801 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 26, బుధవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 7,47,155 కి చేరింది. కరోనా వలన మరోకరు మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,078కి పెరిగింది. అలాగే మరో 2,046 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,05,054కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1570, రంగారెడ్డిలో 284, మేడ్చల్ మల్కాజిగిరిలో 254, హనుమకొండలో 147, ఖమ్మంలో 139 నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (జనవరి 26, సాయంత్రం 5.30 గంటల వరకు):

  • రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 3,16,78,469
  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 7,47,155
  • కొత్తగా నమోదైన కేసులు : 3,801
  • కొత్తగా నమోదైన మరణాలు : 1
  • రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 7,05,054
  • కరోనా రికవరీ రేటు: 94.37%
  • యాక్టీవ్ కేసులు: 38,023
  • నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 4,078
  • కరోనా మరణాల రేటు: 0.55%

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ