ప్రపంచ వ్యాప్తంగా ఒక్క వారంలోనే 2 కోట్ల కరోనా కేసులు – ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Cases, Coronavirus Latest News, Coronavirus Live Updates, coronavirus news, Coronavirus outbreak, Coronavirus Total Cases, Coronavirus Update, Coronavirus updates Live, covid 3rd wave cases in india today, covid third wave in world latest news, COVID-19, COVID-19 Cases, covid-19 over in india, Covid-19 Positive Cases, Covid-19 Positive Cases In World, Covid-19 Third wave, India’s Covid cases top 4 crore, Mango News, Omicron Cases, Over 2 Crore Covid-19 Positive Cases in One Week, Total COVID 19 Cases, WHO, WHO Over 2 Crore Covid-19 Positive Cases in One Week

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కేవలం ఒక్క వారంలోనే కోట్లలో కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీన్ని చూస్తే అర్థం అవుతోంది, కరోనా వైరస్‌ ఏ స్థాయిలో విజృంభిస్తోందో. కేవలం ఒక్క వారంలోనే 2 కోట్లపైనే కొత్త కేసులు నమోదయ్యాయి. జనవరి 17 నుంచి 23 వరకు ప్రపంచ వ్యాప్తంగా 2.1 కోట్లుకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక వారం వ్యవధిలో ఈ స్థాయిలో కోవిడ్ కేసులు వెలుగుచూడటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. అంతకుముందు వారంతో పోలిస్తే కేసుల్లో ఐదు శాతం పెరుగుదల కనిపించిందని వెల్లడించింది డబ్ల్యూహెచ్ఓ.

కేసులు సంఖ్యే కాదు.. మరణాలు కూడా భారీగానే నమోదయ్యాయి ఈ వారంలోనే. దాదాపు 50 వేల మరణాలు సంభవించినట్లు తెలిపింది డబ్ల్యూహెచ్ఓ. మొత్తంగా జనవరి 23 వరకు 34 కోట్లకు పైగా కేసులు, 55 లక్షలకు పైగా మరణాలు సంభవించాయని తెలిపింది డబ్ల్యూహెచ్ఓ. అయితే, గతవారం నమోదైన రెండు కోట్ల కరోనా కేసుల్లో.. అమెరికా, ఫ్రాన్స్, భారత్, ఇటలీ, బ్రెజిల్‌ దేశాల వాటానే ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

అలాగే, మరణాలలో కూడా అమెరికా, రష్యా, భారత్‌, ఇటలీ, యూకే దేశాలు అగ్రభాగాన ఉన్నాయి. ఈ వేరియంట్ కారణంగా నవంబర్, డిసెంబర్‌ మాసాల్లో భారీ స్థాయిలో కేసులు వెలుగులోకి వచ్చాయని, ఇప్పుడు ఆ దేశాల్లో తగ్గుదల ప్రారంభమైందని తెలిపింది. కరోనా ప్రభావంతో ఇప్పటికే చాలా దేశాల్లో అసాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ, కొవిడ్ నిబంధనలు పాటించాలని వైద్య నిపుణులు చూస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + one =