రోజుకు రెండు షిఫ్ట్‌ల్లో డీఎస్సీ పరీక్షలు

DSC Exam Schedule Has Released, DSC Schedule Released, DSC 2024, Exam Schedule, TS DSC 2024, TS TET, CBRT, DSC Exam Schedule, DSC Exams In Two Shifts Per Day, Governament Jobs, Revanth Reddy, Congress, KCR, BRS, Congress, TS Politics, TS Live Updates, Political News, Mango News, Mango News Telugu
TS DSC 2024,TS TET,CBRT,DSC exam schedule,DSC exams in two shifts per day

తెలంగాణలో టీచర్ల పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ పరీక్ష షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. జులై 18 నుంచి ఆగస్టు 5వరకు సీబీఆర్‌టీ  విధానంలో రోజుకు రెండు షిఫ్లుల్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించబోతున్నారు. మొత్తం 80 మార్కులకు ఉండే ఈ  పరీక్షలో 160 ప్రశ్నలు ఉంటాయి.  పరీక్ష రాయడానికి రెండు గంటల 30 నిమిషాల సమయాన్ని ఇస్తారు. డీఎస్సీ పరీక్షలో జనరల్ నాల్డెజ్, టీచింగ్ తో పాటు సబ్జెక్టు నుంచి కూడా ప్రశ్నలు ఉంటాయి. మిగతా 20 మార్కులకు టెట్ వెయిటేజ్ ఉంటుంది. రాతపరీక్ష తర్వాత టెట్ వెయిటీజీని కలిపి ఫైనల్ జాబితాను ప్రకటిస్తారు.

జులై 18న మొదటి షిఫ్ట్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌ ఎగ్జామ్, సెకండ్‌ షిఫ్ట్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ ఎగ్జామ్ నిర్వహిస్తారు. జులై 19 – 22 వరకు వివిధ మాధ్యమాల ఎస్జీటీ ఎగ్జామ్స్ జరుగుతాయి. జులై 20 వ తేదీన ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ , జులై 22వ తేదీన స్కూల్‌ అసిస్టెంట్‌ మ్యాథ్స్‌, జులై 24వ తేదీన స్కూల్‌ అసిస్టెంట్‌ బయలాజికల్‌ సైన్స్‌, జులై 26వ తేదీన తెలుగు భాషా పండిట్‌, సెకండరీ గ్రేడ్‌టీచర్‌ పరీక్ష, జులై 30వ తేదీన స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ ఎగ్జామ్ నిర్వహిస్తారు.

ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి  ఫిబ్రవరి 28న పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయగా.. మొత్తం 11,062 పోస్టులకు గాను 2,79,966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నాను.  దరఖాస్తుల గడువు జూన్  20వ తేదీతో ముగిసింది. గతంతో పోల్చితే అప్లికేషన్స్‌కు అదనంగా మరో లక్షమంది కొత్త దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 11వేల62 ఉద్యోగాల్లో.. 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు  ఉండగా..భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ  796 ఉద్యోగాలు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ