తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరగనుంది?.. ఎవరెవరికి కేబినెట్‌లోకి చోటు దక్కనుంది? ఈ అంశాలపై పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. గత ఏడాది డిసెంబర్ 7న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఈక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలతో పాటు 11 మందికి మాత్రమే మంత్రివర్గంలో చోటు దక్కింది. మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆ స్థానాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగంగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే ఎవరెవరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలనే దానిపై రేవంత్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చారట.
ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై వారితో చర్చలు జరిపారు. అలాగే ఎంపిక చేసిన వారి జాబితాను కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దల ముందు ఉంచారు. వారికి పార్టీ హైకమాండ్ కూడా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఉండనున్నట్లు వార్తలొస్తున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే జూలై 2వ తేదీన మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని సంబంధిత వర్గాలు అంటున్నాయి.
ఇదే సమయంలో మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కనుందనే దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అటు పార్టీలో కూడా పెద్ద ఎత్తున నేతలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. బీసీ, రెడ్డి సామాజిక వర్గాలకు తలో రెండు.. లంబాడీ, మైనార్టీ సామాజిక వర్గాలకు తలో పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బోదన్ ఎమ్మెల్యే సుదర్శణ్ రెడ్డికి అత్యంత కీలకమైన హోంశాఖను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే బీసీ సామాజికవర్గానికి చెందిన నేతల్లో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు.. మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ముదిరాజ్‌కు మంత్రి పదవి దక్కనుందట. ఇక రెడ్డి సమాజిక వర్గానికి చెందిన నేతల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిలో మంత్రి పదవి కోసం పోటీపడుతున్నారు. మరి వీరిలో ఎవరికి పదవి దక్కుతుందో చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE