న్యూ ఇయర్ వస్తుందంటేనే హైదరాబాద్ కొత్త జోష్ తో ఊగిపోతుంది. డిసెంబర్ 31 రాత్రి నుంచి పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్లు వంటివి న్యూ ఇయర్ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటాయి. ఆరోజు రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. అయితే అదే రోజు తాగి యాక్సిడెంట్స్ చేసినవారి సంఖ్య కూడా ఎక్కువే.
అందుకే ఈసారి రోడ్డు ప్రమాదాల నివారించడానికి తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రయాణీకులు కోసం డిసెంబర్ 31 రాత్రి కార్లు, బైక్స్‌లో ఫ్రీ జర్నీ సర్వీసు అందించపోతున్నట్లు ప్రకటించింది. ఈ సదుపాయాన్ని అంతా సద్విని యోగ పరుచుకోవాలని చెబుతోంది.
తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ తీసుకున్న కీలక నిర్ణయం ప్రకారం.. న్యూఇయర్ సందర్భంగా డిసెంబర్ 31, మంగళవారం రాత్రి ఫ్రీ ట్రాన్స్ ఫోర్ట్ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో..ఫ్రీ ట్రాన్స్ ఫోర్ట్ సదుపాయం అందిస్తామని వెల్లడించింది. దీనికోసం 500 కార్లు, 250 బైక్ టాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
డిసెంబర్ 31 వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ సర్వీసును అందుబాటులో ఉంచుతామని.. తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. మద్యం తాగి వాహనాలు నడిపేవారు ఈ సర్వీసు వినియోగించుకోవాలని.. మద్యం తాగి డ్రైవ్ చేసి.. ప్రమాదాలకు కారకులు, బాధితులు అవ్వొద్దని కోరింది.
తాము ఈ సర్వీసును ఇప్పుడే కాదు.. గత ఎనిమిదేళ్లుగా ఈ అందిస్తున్నట్లు తెలిపింది. ఈ సర్వీసు కోసం కాల్ చేయాలనుకున్నవాళ్లు 9177624678 నంబర్‌కు కాల్ ఉంచాలి. తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ , తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ #HumAapkeSaathHai క్యాంపెయిన్‌తో ఈ సర్వీసును అందిస్తున్నట్లు తెలిపాయి.