గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో.. నల్లా బిల్లులు పెండింగ్ పెడుతూ ఇప్పటికీ చెల్లించని వారి కోసం తెలంగాణ ప్రభుత్వం వన్‌టైమ్ సెటిల్మెంట్ ఆఫర్ తెచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లో పెండింగ్ నల్లా బిల్లులు చెల్లించడానికి ప్లాన్ తీసుకువచ్చింది. ఆఫర్ అంటే బంపరాఫర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఆఫర్లో అసలు నల్లా బిల్లు ఎంత వచ్చిందో అంతే కడితే సరిపోతుంది. లేట్ ఫీజు కానీ.. అసలు మీద వడ్డీ వంటివి ఏమీ ఉండవు. దీనివల్ల అదనపు భారం తప్పించుకున్నట్లే.
కాకపోతే ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకే ఉంది. ఈ నెల 31లోగా మెట్రో వాటర్ బోర్డుకి తమ తమ పెండింగ్ నల్లా బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. సమయం తక్కువగా ఉంది కాబట్టి..ఈ అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోవాలని మెట్రో వాటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు.
ఈ వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ ఇళ్లలో వారికీ, ఇళ్లలో ఉండని వారికి అంటే నాన్ డొమెస్టిక్ వారికి, వ్యాపారులకు, పరిశ్రమలకు, వాణిజ్య సంస్థలకు, బల్క్ ఎంఎస్‌బీ కేటగిరీ కనెక్షన్లకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు కూడా వర్తిస్తుంది. నిజానికి ఇలాంటి అవకాశం ఎప్పుడో గానీ గవర్నమెంట్ ఇవ్వదు. దీనివల్ల వడ్డీలూ, లేటు ఫీజులూ లేకుండా బిల్లులు చెల్లించేసి భారం దింపేసుకోవచ్చు.
అయితే సమయం దగ్గరపడుతూ ఉండటంతో.. వెంటనే ఈ పని పూర్తి చేసుకోవడం మేలు. లేదంటే.. మళ్లీ చాలా భారం పడుతుందని మెట్రోపాలిటీ వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డు అధికారులు చెబుతున్నారు. కొంతకాలంగా నల్లా బిల్లుల అమౌంట్ సరిగా రావట్లేదు. ప్రభుత్వం మాత్రం టంచనుగా మంచినీటిని సప్లై చేస్తోంది. మరి బిల్లులు ఎందుకు చెల్లించట్లేదు అనే అంశంపై చర్చించిన అధికారులు..ఈ ఆఫర్ తో అయినా జనాల్లో యాక్టివ్ నెస్ పెంచొచ్చని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.