నివర్ తుఫాన్ పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి – మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Alert over Nivar Cyclone, Cyclone, Cyclone Nivar, Cyclone Nivar live, Cyclone Nivar Live Updates, Cyclone Nivar Tracker, Mango News Telugu, Minister Singireddy Niranjan Reddy, Minister Singireddy Niranjan Reddy Alert over Nivar Cyclone, Nivar Cyclone live updates, Singireddy Niranjan Reddy, Weather Forecast Today

తెలంగాణ రాష్ట్రంపై, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ మీద నివర్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, నివర్ తుఫాన్ పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. నివర్ తుఫాన్ నేపథ్యంలో రైతులు రెండు రోజులపాటు పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావద్దని రైతులను కోరారు. ఇక కొనుగోలు కేంద్రాల వద్ద ఇప్పటికే ఉన్న ధాన్యం, పత్తి వీలయినంత త్వరగా కొనుగోలు చేయించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ధాన్యం, పత్తి తడవకుండా టార్పాలిన్లు , ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని కప్పి ఉంచాలి. పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులు కొనుగోలు కేంద్రాలను వదిలి వెళ్లరాదని మంత్రి సూచించారు. జిల్లా, రీజినల్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. కొనుగోలు కేంద్రాల వద్ద కరంటు సరఫరాలో అంతరాయం కలగకుండా, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏవైనా ఇబ్బందులు వస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =