ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేయడంతో.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ చేసింది. దీంతో పాటు రెడ్ అలర్ట్ ఇచ్చిన జిల్లాలకు.. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని, అవసరం అయితేనే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది. మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ప్రస్తుతం రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. గాలి వ్యాప్తి 20 డిగ్రీలు ఉండగా.. ఉత్తర అక్షాంశం ద్వారా సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు నుంచి 5.8 కిలోమీటర్ల మధ్యలో కొనసాగుతుంది. దీంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రెండు నుంచి మూడు రోజుల్లో అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో ఉరుములు,మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వర్షాపాతం, అలాగే అప్పుడప్పుడు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఖమ్మం, భద్రాది కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించగా.. కరీంనగర్, భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, కొమరంభీమ్ ఆసిఫాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
నిన్న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొద్ది గంటల్లో బలపడి.. తీవ్ర వాయుగుండంగా మారనుందని..దీనివల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాలకు కూడా ఓ మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఐఎండీ హెచ్చరికలతో ఆయా జిల్లాల అధికారులను అలర్ట్ అయ్యారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని ప్రజలకు సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ