రేపు హనుమకొండకు మంత్రి కేటీఆర్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం

BRS Working President and Minister KTR To Inaugurate Party District Office at Hanamkonda Tomorrow,Minister KTR To Inaugurate Party District Office,Minister KTR To Inaugurate Party District Office at Hanamkonda,BRS Working President Inaugurate Party District Office,Mango News,Mango News Telugu,KTR To Inaugurate Party District Office,Party District Office at Hanamkonda,KTR Latest News And Updates,Minister KTR,Telangana Minister KTR,Hanamkonda Latest News And Updates,KTR At Hanamkonda Tomorrow

బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మరియు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ రేపు (శుక్రవారం, మే 5, 2023) హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన బాలసముద్రంలో నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. దీనికి ముందు మంత్రి కేటీఆర్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో ప్రధానంగా వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో సుమారు రూ.181.45 కోట్లతో ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి పనులు ఉన్నాయి. ఈ కార్యక్రమాల అనంతరం శుక్రవారం మధ్యా హ్నం 3.30 గంటలకు హుస్నాబాద్‌ నుంచి ఎర్రగట్టు గుట్ట వద్ద ఉన్న కిట్స్‌ కళాశాలకు చేరుకొని ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు.

అలాగే బాలాజీ గార్డెన్‌లో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నీ విజేతలకు మంత్రి కేటీఆర్‌ బహుమతుల ప్రదానం చేస్తారు. ఆ తర్వాత వరంగల్‌ రీజినల్‌ సైన్స్‌ సెంటర్‌లో రూ.1.80 కోట్లతో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ సెల్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. ఈ క్రమంలో హనుమకొండలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కార్మిక భవన్‌, పూలే భవన నిర్మాణాలకు భూమిపూజ చేస్తారు. అలాగే పట్టణంలో అత్యాధునిక వసతులతో నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ శుక్రవారం సాయంత్రం కాజీపేటలోని సెయింట్‌ గ్యాబ్రియల్‌ స్కూల్‌ మైదానంలో సుమారు 50 వేల మందితో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాలలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొననున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =