వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసిన హోం మంత్రి

Cheques to Families of Deceased Due to Rains, Families Deceased Due to Rains, Heavy Rains In Hyderabad, Home Minister, Home Minister Mahmood Ali, Hyderabad Rains, Hyderabad Rains news, Mahmood Ali, Mahmood Ali Distributed Cheques to Families of Deceased Due to Rains, Telangana rains, telangana rains news, telangana rains updates

తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ ఇటీవల వరదల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు శనివారం నాడు చెక్కులు పంపిణీ చేశారు. పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ, శాసన సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి ఆపత్కాలంలో ప్రజలకు అండగా నిలుస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమస్య శాశ్వత పరష్కారానికి కృషి చేస్తున్నారన్నారు.

భారీ వర్షాలతో పాతబస్తీలో దాదాపు 12 మంది వరదల్లో చనిపోయారన్నారు. చనిపోయిన వారి ప్రతి ఒక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చెక్కును పంపిణీ చేశారు. బహదూర్ పురాకు చెందిన బాధిత కుటుంబ సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొంతమంది మరణించిన వారి కుటుంబ సభ్యులు హాజరు కాలేకపోయారు. దీంతో వారి చెక్కులు తహసీల్దార్ కి అప్పగించారు. అక్టోబర్ 13 మరియు 14 వ తేదిలలోని వర్షాలలో తమ ఇళ్ళు పూర్తిగా దెబ్బతిన్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయిస్తుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ గుర్తు చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu