అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణలో తమకు తిరుగులేదు అనుకున్న బీఆర్ఎస్ కు గత ఎన్నికల్లో ఓటమితో ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారు అయింది. అయితే కేసీఆర్ కు రాజకీయ చతురత దృష్ట్యా బీఆర్ఎప్ పార్టీ మళ్లీ పుంజుకుంటుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే కేసీఆర్ ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి. వాటిని ఎలా అధిగమిస్తారన్న దాని మీదే ఆ పార్ఠీ భవితవ్యం మీద ఆధారపడి ఉంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుదామని ఆశించి పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పేరు మార్చితే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుడు మాటెరుగు సొంత రాష్ట్రంలో పార్టీని కాపాడుకోలేని పరిస్థితికి వచ్చింది. రోజుకో ఎమ్మెల్యే చొప్పున్న ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. ఎమ్మెల్యేలే కాదు ఎమ్మెల్సీలు అదే తోవ లో వెళుతున్నారు. శాసనమండలి చైర్మన్ కూడా పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది. అటు లోక్ సభలో ఎంపీలు లేరు, ఇప్పటికే ఉన్న రాజ్యసభ ఎంపీలు ఎంత వరకు బీఆర్ఎస్ తోనే ఉంటారన్నది కూడా సస్పెన్స్ గా మారింది.
ఓ వైపు పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీ కి కేసులు కూడా సవాల్ విసురుతున్నాయి. కాళేశ్వరం లోని మేడిగడ్డ రిజర్వాయర్ కుంగిపోవడం, విద్యుత్ కొనుగోలు అగ్రిమెంట్లు, ఫోన్ ట్యాపింగ్ లు ఇలా అన్ని కేసులు బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అన్నింటికి మించి కవిత అరెస్ట్. లిక్కర్ స్కాంమ్ లో అరెస్ట్ అయిన కవితకు ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. కవిత జైలుకు వెళ్లిన సానుభూతి రాకపోగా ఇంకా వ్యతిరేకతను మూటగట్టుకుంది. కవిత అరెస్ట్ అయింది లిక్కర్ స్కాంలో కావడంతో ప్రజలు ఎవరు కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోగా వ్యతిరేకత మరింత పెరిగింది. ఇక మరో అంశం పార్టీ అధ్యక్షుడు… ఇప్పడు బీఆర్ఎస్ ముందు కేసీఆర్ ముందు ఉన్న అసలైన సవాల్ ఆపార్టీ కి తదుపరి నాయకుడు ఎవరనేది. బీఆర్ఎస్ క్యాడర్ లో నే ఈ అయోమయం నెలకొంది. ఇక బీఆర్ఎస్ తదుపరి నాయకుడు ఎవరు అనేది కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఆ పార్టీ పగ్గాలు చేపడతారా లేక హరీష్ రావు పార్టీ ని ముందుండి నడిపిస్తాడా అనే అయోమయంలో ఉన్నారు. అధికారంలో ఉండగా కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగగా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు. కానీ ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయింది. అందులోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో నాయకుడు క్యాడర్ కు ఉత్సహాన్ని ఇవ్వాల్సిన అవసరముంటుంది.
ఇక బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లడం పైన కూడా ఆ పార్టీ భవితవ్యం ఆధారపడి ఉంది. బీఆర్ఎస్ ఇప్పుడు ఏ నినాదంతో ప్రజల్లోకి వెళతారనే అంశం కూడా కీలకంగా మారనుంది. గడిచిన 8 నెలలుగా ఆ పార్టీ అత్తెసరు విమర్శలు చేయడం తప్పితే ఏ నినాదంతో ప్రజల్లోకి వెళ్లలేదు. తెలంగాణలో బీజేపీ పెరుగుదల కూడా బీఆర్ఎస్ పార్టీ మనుగడ పై ప్రభావం చూపే అవకాశముంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 35 శాతం ఓటింగ్ సాధించిన బీజేపీ పార్టీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతమే లక్ష్యం గా ముందుకు సాగుతుంది. బీజేపీ బలోపేతం కాకుంటే కచ్చితంగా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలదొక్కుకుని పుంజుకునే అవకాశాలుంటాయి. కానీ ఇక్కడ సానుకూల అంశం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ప్రాంతీయ పార్టీలకు ఎప్పుడు సముచిత స్థానం కల్పించారు. అందుకే బీఆర్ఎస్ కు ఇప్పుడు ఎన్ని కష్టాలు నిలదొక్కుకుంటే మళ్లీ పుంజుకోవడం ఖాయమని రాజకీయ పండితులు విశ్లేషణలు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY