బీజేపీకి షాక్ ఇచ్చిన ఎంపీ వివేక్.. త్వరలో కాంగ్రెస్‌లోకి..

mp vivek, bjp, kishan reddy, congress, revanth reddy, telangana assembly elections
mp vivek, bjp, kishan reddy, congress, revanth reddy, telangana assembly elections

బీజేపీలో ఉండలేక.. ఇతర పార్టీలు పట్టించుకోక మొన్నటి వరకు తలపట్టుకొని కూర్చున్నారు మాజీ ఎంపీ వివేక్. కొద్దిరోజులుగా ఆయనకు పార్టీలో ప్రధాన్యత తగ్గిపోయింది. ఆయన్ను పట్టించుకునే వారే కరువైపోయారు. అంతేకాకుండా టికెట్ల పంపిణీ కూడా ఆయన కోరుకున్నట్లు లేకపోవడంతో.. కిషన్ రెడ్డితో కూడా వివేక్ అంటిముట్టనట్లు ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఇన్నిరోజులు ఆయన్ను పట్టించుకోకపోవడంతో.. వివేక్ తర్జనభర్జన పడ్డారు.

అయితే ఎట్టకేలకు వివేక్‌కు కాంగ్రెస్ నుంచి పిలుపొచ్చింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. వివేక్‌తో సమావేశమై కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అయితే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న పిలుపు రావడంతో.. వివేక్ కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యేందుకు రెడీ అయిపోయారు. కాంగ్రెస్ కండువా కప్పుకోనేందుకు సిద్ధమయ్యారు. త్వరలో రాహుల్ గాంధీ సమక్షంలో వివేక్ తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు.

అటు కాంగ్రెస్ పార్టీలో చేరబోతుండడంతో.. వివేక్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. ఇటీవల రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసినప్పుడే.. వివేక్ కూడా చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అప్పటికీ వివేక్‌కు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందక పోవడంతో.. ఆ వార్తలను ఆయన కొట్టి పారేశారు. తాను బీజేపీ రాజీనామా చేయడం లేదని.. ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఇన్విటేషన్ రావడంతో.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయిపోతున్నారు.

అటు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు వివేక్‌కు రెండు ఆఫర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. చెన్నూరు ఎమ్మెల్యే టికెట్, పెద్దపల్లి ఎంపీ టికెట్ వివేక్ కుటుంబానికి ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి వివేక్ కుమారుడు పోటీ చేయనున్నారట. అలాగే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి ఎంపీగా వివేక్ పోటీ చేయనున్నారట.

మరోవైపు బీజేపీ నుంచి వరుసగా దిగ్గజ నేతలు పార్టీలు మారుతున్నారు. పార్టీలో ప్రాధాన్యత లేక.. టికెట్ దక్కక.. అసంతృప్తితో ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇటీవల కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పి హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు వివేక్ కూడా ఆ పార్టీకి టాటా చెప్పేశారు. అయితే కీలకమైన ఎన్నికల వేళ దిగ్గజ నేతలు పార్టీలు మారడం.. బీజేపీకి పెద్ద దెబ్బే అని విశ్లేషకులు అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =